ETV Bharat / bharat

Terrorists Enters In India : భారత్​లోకి 70 మంది ఉగ్రవాదులు!.. నేపాల్​ సరిహద్దు నుంచి ప్రవేశం - nia raids on terrorism

Terrorists Enters In India : దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. నకిలీ పాస్​పోర్టులతో సుమారు 70 మంది ఉగ్రవాదులు నేపాల్​ సరిహద్దుల నుంచి భారత్​లోకి వచ్చినట్లు అనుమానిస్తున్నాయి.

terrorists enters in india
terrorists enters in india
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 8:02 AM IST

Updated : Oct 21, 2023, 8:56 AM IST

Terrorists Enters In India : నకిలీ పాస్​పోర్టులతో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. సుమారు 70 మంది ఉగ్రవాదులు నేపాల్​ సరిహద్దుల నుంచి భారత్​లోకి ప్రవేశించినట్లు భావిస్తున్నాయి. వీరంతా ISI (ఇంటర్​ సర్వీసెస్ ఇంటిలిజెన్స్​)లేదా జమ్మాత్​ ఉల్​ ముజాహీద్దీన్ బంగ్లాదేశ్​కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్​ సరిహద్దును అప్రమత్తం చేసింది కేంద్రం.

ప్రస్తుతం అన్ని సరిహద్దుల్లో కంచెలతో కట్టుదిట్టమైన భద్రత ఉంది. అయినా సరే ఎక్కడో కొన్ని చోట్ల చొరబాట్లు జరుగుతాయి. ముఖ్యంగా పాకిస్థాన్​ వైపు నుంచి భారత్​లోకి చొరబడడం అసాధ్యం. అందుకోసమే ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దు నుంచి భారత్​లోకి వస్తున్నాయి. ఉగ్రవాదులే కాకుండా కొంతమంది విదేశీయులు కూడా దేశంలోకి వచ్చినట్లు సమాచారం ఉంది.

--కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు

అయితే, భారత్​లోకి అక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కేంద్ర సంస్థ వర్గాలు తెలిపాయి. కేంద్ర పరిధిలోని వివిధ దర్యాప్తు సంస్థలు ఉగ్రవాదుల వెతుకులాటను ప్రారంభించినట్లు చెప్పాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో పాటు కేంద్ర భద్రతా సంస్థలు బంగాల్​, సిక్కిం సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే సోదాలు నిర్విహించింది. ఫేక్ పాస్​పోర్టులతో కొందరు ప్రవేశించినట్లు గుర్తించింది. జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు బంగాల్​ పోలీసులతో సమావేశాలు ఏర్పాటు చేసింది సీబీఐ.

53 చోట్ల NIA సోదాలు
NIA Raids On Terrorism : ఖలిస్థాన్‌తోపాటు ఇతర ఉగ్ర ముఠాలు, గ్యాంగ్‌స్టర్లు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇటీవలె దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు దిల్లీ, చండీగఢ్‌లలోని 53 ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సమన్వయంతో ఏకకాలంలో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఉగ్రవాదులు, స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లు సంబంధాలు ఏర్పర్చుకుని సుపారీ హత్యలు, దోపిడీలు, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై ఎన్‌ఐఏ దృష్టిపెట్టింది. వారి బంధాన్ని విచ్ఛిన్నం చేసి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు రంగంలోకి దిగింది. నిధులు, ఆయుధాలు సమకూర్చేవారిని లక్ష్యంగా చేసుకొంది. ఉగ్రవాది అర్శ్‌ డల్లా, కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, నరేందర్‌ అలియాస్‌ లాలి, సుఖా దునికె, హారీ మౌర్‌, కాలా జఠేడీ, దీపక్‌ టినూ తదితరులకు సంబంధించిన కేసుల్లో తాజా దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Baramulla Encounter : ఉగ్రవాదుల కోసం ఆర్మీ స్పెషల్​ ఆపరేషన్.. ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతం

NIA On Hizb ut Tahrir case : హిజ్బుత్ తహ్రీర్ కేసు.. హైదరాబాద్​లో పరారీలో ఉన్న సల్మాన్‌ అరెస్టు

Last Updated : Oct 21, 2023, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.