ETV Bharat / bharat

Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

author img

By

Published : Oct 8, 2021, 10:59 PM IST

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో (Kashmir Encounter) ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాది పరారయ్యాడు. కాల్పుల్లో మృతిచెందిన ఉగ్రవాది వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

kashmir encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని నాటిపుర ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో (Kashmir Encounter) ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టారు పోలీసులు. మరో ముష్కరుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఘటనాస్థలం నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం..

ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ముష్కరుల కాల్పులకు (Kashmir Encounter) ప్రతిఘటించిన పోలీసులు.. వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ ముష్కరుడు హతంకాగా మరో ఉగ్రవాది పరారయ్యాడు.

కాల్పుల్లో మృతిచెందిన ఉగ్రవాది వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న ఉగ్రవాది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : Mumbai Airport: ముంబయి ఎయిర్​పోర్ట్​లో గందరగోళం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.