Terrorist Attack: జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రగాయాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈద్గా ప్రాంతంలోని తన నివాసం బయటే కాల్చి చంపినట్లు తెలిపారు.
మృతుడ్ని రౌఫ్ అహ్మద్ ఖాన్‌గా గుర్తించారు. ఇతడు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు బృందంపై..
అనంత్‌నాగ్ బిజ్బెహరా ప్రాంతంలో పోలీసు బృందంపైనా ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఏఎస్ఐ మహ్మద్ అష్రఫ్.. అమరులైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఉగాండా నుంచి వచ్చిన ఆమె బ్యాగ్‌లో రూ.14కోట్ల హెరాయిన్