Terror Threat Mumbai: ముంబయి పోలీసులకు ఖలిస్థానీల నుంచి బెదిరింపు వచ్చింది. నగరంలో వారు ఉగ్రదాడులకు పాల్పడతారనే అనుమానం ఉన్న క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్ 31(శుక్రవారం) పోలీసులు నగరవ్యాప్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీచేశారు.
ఈ మేరకు పోలీసులకు సెలవులను రద్దు చేశారు. ముంబయిలోని ప్రధాన ప్రాంతాలైన దదర్, బంద్రా చర్చ్‌గేట్, సీఎస్ఎంటీ, కుర్లా.. తదితర స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం.
శుక్రవారం ఒక్కరోజే 3వేలమంది రైల్వే అధికారులు నగరవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లలో విధులు నిర్వర్తించనున్నట్లు ముంబయి రైల్వే అధికారి ఖైజర్ ఖలీద్ తెలిపారు. ఇప్పటికే ఒమిక్రాన్ దృష్ట్యా రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు.
ఇదీ చూడండి: మెట్ల నుంచి 'పియానో' రాగాలు.. ఫిదా అవుతున్న ప్రయాణికులు