ETV Bharat / bharat

ఉగ్రకుట్ర భగ్నం - ఇద్దరు ముష్కరులు అరెస్ట్​

author img

By

Published : Jan 19, 2021, 10:17 AM IST

Updated : Jan 19, 2021, 10:57 AM IST

రిపబ్లిక్​ డే లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు. జైషే మహ్మద్​ సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను సోమవారం అరెస్ట్​ చేశారు. వారి స్థావరాన్ని ధ్వంసం చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Terror module busted in J-K, two JeM operatives held, ammunition seized
ఉగ్రకుట్ర భగ్నం - ఇద్దరు ముష్కరులు అరెస్ట్​

గణతంత్ర దినోత్సవానికి ముందు భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్​ పోలీసులు భగ్నం చేశారు. వారి స్థావరంపై దాడి చేసి ఇద్దరు ముష్కరులను సోమవారం.. అరెస్ట్ చేశారు. భారీగా ఆయుధాలను, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Terror module busted in J-K, two JeM operatives held, ammunition seized
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

అరెస్ట్​ చేసిన ఇద్దరు తీవ్రవాదులను ఉమర్​ అహ్మద్​ మాలిక్, సుహేల్ అహ్మద్​ మాలిక్​గా గుర్తించారు పోలీసులు. వారు అనంత్​నాగ్​ బిజ్​బెహరా సెమ్​తాన్​ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు దుండగులు జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధరించారు. జైషే మహ్మద్​ సంస్థ ఉగ్రవాది అఖిబ్ అలియాస్ ఆల్ఫా.. వీరికి డ్రోన్స్​ ద్వారా ఆయుధాలను అందించినట్లు తెలిపారు. ఉగ్రకుట్రపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి : జవాన్ల అత్యవసర వైద్యానికి 'రక్షిత' సేవలు ప్రారంభం

Last Updated : Jan 19, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.