ETV Bharat / bharat

వాట్సాప్​కు ఉగ్రవాదులు గుడ్​ బై.. ఆ 3 యాప్స్​తో! - messaging apps

సమాచార మార్పిడిలో గోప్యతకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు ఉగ్రవాదులు. ఇప్పటికే వాట్సాప్​, ఫేస్​బుక్​లలో ప్రైవసీ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​లోని ఉగ్రసంస్థలతో చర్చించేందుకు కొత్త మెసేజింగ్​ యాప్​లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Terror groups in Pakistan switch to new messaging apps
కొత్త మెస్సేజింగ్ యాప్​లను వినియోగిస్తున్న పాక్ ఉగ్రవాదులు
author img

By

Published : Jan 24, 2021, 4:35 PM IST

వాట్సాప్​ ప్రైవసీ విధానంపై అనుమానాలు రేకెత్తిన వేళ ఉగ్రసంస్థలు ఇతర మెసేజింగ్​ వేదికలపై కన్నేశాయి. భారత భద్రతా దళాల నిఘా నుంచి తప్పించుకునేందుకు మూడు సరికొత్త అప్లికేషన్లను వినియోగిస్తున్నారు ఉగ్రవాదులు. పట్టుబడిన తీవ్రవాదుల నుంచి అధికారులు వాటి వివరాలను సేకరించారు. పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాద సంస్థలతో సంప్రదింపులు జరపడానికి వీటిని వినియోగిస్తున్నట్లు తెలిసింది.

ఆ మూడు దేశాలకు చెందినవి...

మూడు మెసేజింగ్​ యాప్​లలో ఒకటి అమెరికాకు చెందిన సంస్థ కాగా రెండోది ఐరోపా, మూడోది టర్కీకి చెందినదిగా గుర్తించారు. కశ్మీర్​ లోయలో ఉగ్రవాదులు తమలో చేరబోయే వారితో చర్చించడానికి టర్కీ యాప్​ను తరచుగా వాడుతున్నట్లు సమాచారం. భద్రత సమస్యల దృష్ట్యా యాప్​ల పేర్లను అధికారులు వెల్లడించలేదు.

పాత సాంకేతిక..

ఇంటర్నెట్​ వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ సమర్థంగా పనిచేసేలా ఈ మూడు యాప్​లను రూపొందించారు. 2జీ నెట్​వర్క్​ వినియోగించే రోజుల్లో వాడిన ఎన్​హాన్స్​డ్ డేటా ఫర్ గ్లోబల్​ ఎవల్యూషన్ (ఎడ్జ్​) సాంకేతికనే ఇవి వినియోగిస్తున్నాయి.

ఫేస్​బుక్​, వాట్సాప్​లను వాడటం ఉగ్రసంస్థలు పూర్తిగా మానేశాయి. ప్రస్తుత మెసేజింగ్​ యాప్​లలో ఎన్​క్రిప్షన్, డిక్రిప్షన్​ రెండూ పరికరంలోనే జరుగుతాయి. కాబట్టి ఏ సమయంలోనూ ఇతరులు జోక్యం చేసుకోవడానికి వీలుపడదు. ఎన్​క్రిప్షన్​ కోసం అత్యంత భద్రమైనదిగా భావించే ఆర్​ఎస్​ఏ-2048 ఆల్గరిథమ్​ను వీటిల్లో వినియోగిస్తున్నారు.

పూర్తి గోప్యంగా..

ఉగ్రవాదులు వినియోగించే ఈ మెసేజింగ్​ యాప్​లలో కనీసం వినియోగదారుల ఫోన్​ నంబర్, ఈమెయిల్​ కూడా అడగవు. అందువల్ల వారి వివరాలు ఎవరికీ తెలిసే అవకాశముండదు. జమ్ముకశ్మీర్​లో ఇలాంటి అప్లికేషన్లను నిషేధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వర్చువల్​ సిమ్​ల ముప్పునకు వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా దళాలకు ఈ యాప్​లు మరింత తలనొప్పిగా మారాయి.

ఇదీ చూడండి: పౌరుల గోప్యత ప్రభుత్వాల బాధ్యత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.