ETV Bharat / bharat

కశ్మీర్​పై పాక్ మరో కుట్ర- ఉగ్రమూకలకు 'లౌకిక' ముసుగు! - ఉగ్రవాద సంస్థలు కశ్మీర్​లో

Terror Groups In Kashmir: జమ్ముకశ్మీర్‌లో కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకురావడం కలవరపాటుకు గురిచేస్తోంది. రెండేళ్లలో కొత్తగా 4 ఉగ్రమూకలను భద్రతాదళాలు గుర్తించాయి. సెక్యులర్‌ పేర్లతో పూర్తిగా కశ్మీర్‌లో పుట్టుకొచ్చిన ఉగ్రవాదంగా వీటిని చూపాలని పాక్‌ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పోలీసుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 'కశ్మీరీ టైగర్స్‌' సంస్థ హస్తం ఉన్నట్లు అనుమానాలున్నాయి. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత పోలీసులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.

Terror Groups
ఉగ్రవాద సంస్థలు
author img

By

Published : Dec 14, 2021, 6:20 PM IST

Terror Groups In Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. చిన్న చిన్న ఉగ్ర సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నట్లు భద్రతాదళాలకు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా సోమవారం పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన వెనుక కశ్మీర్‌ టైగర్స్‌ అనే ఉగ్రసంస్థ హస్తం ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌కు 2019లో ఆర్టికల్‌ 370 తొలగింపు తర్వాత అక్కడ పోలీసులపై జరిగిన పెద్దదాడి ఇదే కావడం కలవరానికి గురిచేస్తోంది.

తెరపైకి కశ్మీర్‌ టైగర్స్‌..

Kashmir Tigers: ఈ ఏడాది జనవరిలో తొలిసారి కశ్మీర్‌ టైగర్స్‌ అనే ఉగ్రసంస్థ పేరు తెరపైకి వచ్చింది. దీన్ని జైషే మహ్మద్​కు అనుబంధ సంస్థగా అనుమానిస్తున్నారు. జూన్‌లో దక్షిణ కశ్మీర్‌లో జరిగిన గ్రనేడ్‌ దాడికి ఈ సంస్థే బాధ్యత ప్రకటించుకుంది. 2019 తర్వాత కొత్త ఉగ్రసంస్థలు పుట్టుకొస్తున్నాయని భద్రతాదళాలు చెబుతుండగా.. వీటిల్లో ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌, పీపుల్స్‌ అగైనెస్ట్‌ ఫాసిస్ట్‌ ఫోర్స్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ వంటి సంస్థలు ఇప్పటికే పాపులర్‌ కాగా తాజాగా కశ్మీరీ టైగర్స్‌ పేరు తెరపైకి వచ్చింది. వీటికి హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌, లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ సంస్థల మద్దతు ఉంటోంది. మొత్తం ఈ రెండేళ్లలో 4 కొత్త ఉగ్రసంస్థలను భద్రతాదళాలు గుర్తించాయి.

కొత్తగా వచ్చే ఉగ్రసంస్థలు మతపరమైన పేర్లు కాకుండా సెక్యులర్‌ పేర్లను ఎంచుకుంటున్నాయి. జైషే సంస్థ నుంచి విడిపోయిన అనంతనాగ్‌కు చెందిన ఉగ్రవాది ముఫ్తీ అల్తాఫ్‌... కశ్మీరీ టైగర్స్‌ను ప్రారంభించాడు. జైషే నుంచి వచ్చే ఉగ్రవాదులను అందులో చేర్చుకున్నాడు.

ఒత్తిడిలో పాక్​!

కశ్మీర్‌లో ఉగ్రసంస్థలను ప్రోత్సహించే విషయంలో పాకిస్థాన్‌ ఒత్తిడికి గురవుతోందని తాజా పరిణామాలు చెబుతున్నట్లు భద్రతాదళాలు వెల్లడించాయి. లష్కరే, జైషే వంటి పేర్లు పాకిస్థాన్‌కు చెందినవి కావడం వల్ల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్-ఎఏటీఎఫ్​కు భయపడి కొత్తవ్యూహం అమలుచేస్తోందని చెబుతున్నారు. పేర్లు సెక్యులర్‌గా మార్చి పూర్తిగా కశ్మీర్‌లో పుట్టుకొచ్చిన ఉగ్రవాదంగా చూపాలని యత్నిస్తోందని అంటున్నారు.

Terrorism In Kashmir: ప్రస్తుతం కశ్మీర్‌లో దాదాపు 200మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: జవాన్ల కోసం 'ఏసీ జాకెట్లు'.. 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ కూల్​గా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.