ETV Bharat / bharat

దిల్లీలో ఉగ్రదాడులకు కుట్ర.. పోలీసుల హైఅలర్ట్​! - దిల్లీ పోలీసులు

Terror attack alert in Delhi: దిల్లీలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు చేపట్టేందుకు కుట్ర జరుగుతోందన్న సమాచారం మేరకు అప్రమత్తమయ్యారు పోలీసులు. మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తెహ్రీక్​ ఈ తాలిబన్​ సంస్థ పేరుతో పలువురికి మెయిల్స్​ వచ్చాయని పేర్కొన్నారు.

terror attack alert in delhi
దిల్లీలో భారీస్థాయిలో ఉగ్రదాడులకు కుట్ర
author img

By

Published : Mar 23, 2022, 10:18 PM IST

Terror attack alert in Delhi: దిల్లీలో ఉగ్రదాడులు జరిపేందుకు కుట్ర జరుగుతోందని అందిన సమాచారం మేరకు అప్రమత్తమయ్యారు అక్కడి పోలీసులు. ఈ దాడులపై ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు తమకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసినట్లు దిల్లీ పోలీస్​ ప్రత్యేక విభాగం పేర్కొంది. దిల్లీలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు చేస్తామని 'తెహ్రీక్​ ఈ తాలిబన్​' ఉగ్రసంస్థ నుంచి కొందరికి ఈమెయిల్స్​ వచ్చాయని పేర్కొంది. సమాచారం అందించిన యూపీ పోలీసులను ప్రశంసించింది.

దిల్లీ పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేయటం సహా ఈ సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టాలని సూచించింది ప్రత్యేక విభాగం. ముఖ్యంగా అన్ని మార్కెట్లలో భద్రతను దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మెయిల్​ పంపిన వ్యక్తిని పట్టుకుని, అందులోని సమాచారాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు.. భద్రతాపరమైన ముప్పు కారణంగా మార్కెట్లను మూసివేసి కట్టుదిట్టమైన నిఘా వేయాలని దిల్లీ పోలీసులకు ఆదేశాలు అందినట్లు సరోజిని నగర్​ మినీ మార్కెట్​ ట్రేడర్స్​ సంఘం అధ్యక్షుడు పేర్కొన్నారు. అయితే.. తాము తనిఖీలు చేసేందుకే వెళ్లామని, మార్కెట్లను మూసివేసేందుకు కాదని పోలీసులు తెలిపారు.

సరోజిని మార్కెట్లో ప్రతి అంగుళాన్ని జల్లెడపడుతున్నారు భద్రతా సిబ్బంది. అయితే, ఎలాంటి అనుమానాస్పద పదార్థం, సామగ్రి లభించకపోవటం వల్ల ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలో కొద్ది సమయం మార్కెట్​ను మూసివేశారు. ఇటీవల భోపాల్​లో ఓ ఉగ్రవాదిని అరెస్ట్​ చేయగా.. భారత్​లోని 9 రాష్ట్రాల్లో ఉగ్రదాడులు చేపట్టనున్నట్లు పోలీసులకు తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.