రాబోయే పండగ సీజన్‌లో దేశంలో భారీ ఉగ్రకుట్రలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు (Intelligence Bureau of India)హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు అఫ్గాన్‌కు చెందిన ముష్కరులు సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.
ఈ మేరకు లష్కర్-ఏ-తొయిబా(Lashkar-e-Taiba), హర్కత్ ఉల్-అన్సార్ (హువా), హిజ్బుల్ ముజాహిద్దీన్(Hizbul Mujahideen) కదలికలకు సంబంధించి పక్కా సమాచారం అందినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. 'అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghan Taliban) స్వాధీనం చేసుకున్న తరువాత ఐఎస్ఐ మద్దతుతో అఫ్గాన్ ముష్కరులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం అందింది' అని నిఘా అధికారి ఒకరు వెల్లడించారు.
టిఫిన్ బాంబుల తయారీ..
నియంత్రణ రేఖ(Line of Control) వెంబడి పాకిస్థాన్ నక్యాల్ సెక్టార్‌లోని ఉగ్రక్యాంపులో దాదాపు 40 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. వీరంతా పూంచ్ నది ద్వారా భారత్‌లోకి ప్రవేశించేలా శిక్షణ పొందారని పేర్కొన్నాయి.
'పండగల సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులకు టిఫిన్ బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చినట్లు మాకు సమాచారం అందింది. భారత్‌లో యాక్టివ్‌గా(Active Terrorist Groups) ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా టిఫిన్ బాంబుల తయారీకి కావలసిన ముడిసరుకు అందుతుంది' అని నిఘా వర్గాలు వివరించాయి. ఈ సమాచారంపై పారామిలిటరీ, రాష్ట్ర పోలీసులతో పాటు సంబంధిత ఏజెన్సీలను నిఘా ఏజెన్సీ అప్రమత్తం చేసింది.
ఇవీ చదవండి: