ETV Bharat / bharat

Termites Eat Money : బ్యాంక్​ లాకర్​లో 'చెదలు'.. రూ.18లక్షలు స్వాహా.. ఆమెకు ఆ విషయం తెలియదట! - ఉత్తర్​ప్రదేశ్​ బ్యాంక్​ లాకర్​లో చెదలు

Termites Eat Money In Bank Locker : బ్యాంక్​ లాకర్​లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18లక్షలను చెదలు స్వాహా చేశాయి. దీంతో మహిళ ఒక్కసారిగా షాక్​కు గురైంది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Termites Eat Money In Bank Locker
Termites Eat Money In Bank Locker
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 11:18 AM IST

Termites Eat Money In Bank Locker : ఉత్తర్​ప్రదేశ్ మొరాదాబాద్​లోని బ్యాంక్​ లాకర్​లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18లక్షలు.. నల్లని మట్టిగా మారిపోయాయి! మొత్తం డబ్బును చెదలు ముక్కలుముక్కలుగా చేసేశాయి. దీంతో వాటిని చూసిన మహిళ షాక్​కు గురై బ్యాంక్ మేనేజర్​కు ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగిందంటే?
మొరాదాబాద్.. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్‌.. స్థానికంగా పరుపుల వ్యాపారం చేస్తోంది. ఆమెకు బ్యాంక్ ఆఫ్ బరోడా రామగంగా విహార్​ బ్రాంచ్‌లో ఖాతా ఉంది. కొన్నినెలల క్రితం ఇదే బ్యాంక్​లో ఆమె లాకర్​ తీసుకుంది. గతేడాది అక్టోబర్​ నెలలో అల్కా తన కుమర్తెకు వివాహం చేసింది. ఆ సందర్భంగా బంధుమిత్రులు డబ్బులు, నగల రూపంలో ఇచ్చిన కానుకలను లాకర్​లో భద్రపరిచింది. మొత్తం రూ.18లక్షలతో పాటు విలువైన నగలను లాకర్​లో ఉంచింది.

అయితే సెప్టెంబర్​ 25వతేదీన​ కేవైసీ, లాకర్​ అగ్రిమెంట్​ రెన్యువల్​ కోసం అల్కా.. బ్యాంక్​కు వెళ్లింది. ఆ సమయంలో లాకర్​ను తెరిచిన అల్కా.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. డబ్బు నోట్లన్నింటినీ చెదలు తినేసి ఉండడం గమనించింది. వెంటనే బ్యాంక్​ మేనేజర్​కు విషయాన్ని చేరవేసింది. ఆయన వచ్చి చూడగా.. చెద పురుగుల దాడికి నోట్లు నల్లని మట్టి, ముక్కలుగా పడి ఉన్నాయి. అయితే నగలు భద్రంగానే ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్​ తెలిపారు. కేసును విచారిస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్​ లాకర్​లో డబ్బులు పెట్టకూడదని విషయం తనకు తెలియదని అల్కా చెప్పింది.

termites in bank locker termites eat away rs 18 lakh kept in bank of baroda locker in moradabad
రూ.18లక్షలను స్వాహా చేసిన చెదలు

లాకర్ల గురించి ఈ 5 రూల్స్​ తప్పక తెలుసుకోండి!
Bank Locker New Rules 2023 : రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశం మేరకు బ్యాంకులు తమ లాకర్​ నిబంధనలను మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. ఈ మేరకు కస్టమర్లకు కూడా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే రివైజ్డ్​ లాకర్​ అగ్రిమెంట్​పైన సంతకం చేసినవారు, సప్లమెంటరీ అగ్రిమెంట్​పై కూడా సంతకం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి బ్యాంకులు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్​బీఐ ఇప్పటికే తన కస్టమర్లకు సవరించిన బ్యాంక్​ లాకర్ రూల్స్​ గురించి, దాని సప్లమెంటరీ అగ్రిమెంట్​ గురించి సమాచారాన్ని అందిస్తోంది. బ్యాంక్​ ఆఫ్​ బరోడా కూడా ఇదే మార్గంలో పయనిస్తోంది. ఆర్​బీఐ నిర్దేశం మేరకు మిగతా బ్యాంకులు తప్పనిసరిగా ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందుకోసం 2023 డిసెంబర్​ నెలాఖరు వరకు సమయం ఉంది. రివైజ్డ్​ బ్యాంక్​ లాకర్ రూల్స్​​ విషయంలో ఆర్​బీఐ కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అవేంటో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.