Student Shot Teacher Bothroom Vedio: మహారాష్ట్ర పుణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి.. తన ట్యూషన్ టీచర్ బాత్రూమ్ వీడియో తీశాడు. విద్యార్థికి హోమ్ ట్యూషన్ చెప్పించడానికి ఓ టీచర్‌ను ఎంపిక చేశారు అతని తల్లిదండ్రులు. గత ఐదేళ్లుగా ఆమె ఆ విద్యార్థికి పాఠాలు బోధిస్తోంది. టీచర్ ప్రతిరోజు విద్యార్థి వద్దకే వచ్చి పాఠాలు చెబుతుండేది. అయితే.. టీచర్ పట్ల విద్యార్థి దుర్బుద్ధిని ప్రదర్శించాడు. టీచర్ బాత్రూమ్ వీడియోను తీయాలని సంకల్పించాడు. అందుకు తగ్గట్లుగా బాత్రూమ్లో మొబైల్ ఫోన్‌ను అమర్చాడు.
ఈ క్రమంలో రోజూలాగే పాఠం చెప్పిన అనంతరం బాత్రూమ్ వెళ్లిన టీచర్.. అక్కడ సోప్ బాక్స్‌లో కెమెరా వంటి వస్తువును పసిగట్టింది. తీసి చూస్తే.. ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఉంది. ఖంగుతిన్న టీచర్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాఠాలు చేప్పే క్రమంలోనూ తన శరీర భాగాలను ఫోటోలు తీశాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. టీచర్ వయస్సు 56 ఏళ్లు ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి: ఆ పశువుల యజమానులకు ఏడాది జైలు.. బిల్లుకు అర్ధరాత్రి ఆమోదం!