ETV Bharat / bharat

మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 46 లక్షల టీకాలు - India corona positivity rate

మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ సహా 10 రాష్ట్రాల్లోనే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. శనివారం నమోదైన కేసుల్లో 71.75 శాతం.. ఈ రాష్ట్రాల్లోనే వెలుగు చూసినట్లు పేర్కొంది. మరోవైపు... రాబోయే మూడురోజుల్లో రాష్ట్రాలకు మరో 46 లక్షల టీకా డోసులు అందజేయనున్నట్లు తెలిపింది.

states covid-19 cases
రాష్ట్రాల్లో కరోనా కేసులు
author img

By

Published : May 9, 2021, 3:50 PM IST

దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం నమోదైన 4 లక్షలకు పైగా కేసుల్లో 71.75 శాతం.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, దిల్లీ, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​, బంగాల్​, రాజస్థాన్​, హరియాణా రాష్ట్రాల్లోనే వెలుగుచూసినట్లు పేర్కొంది. వీటిలో అత్యధిక కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. కర్ణాటక, కేరళ తర్వాత వరుసలో ఉన్నట్లు తెలిపింది.

ఆరోగ్యశాఖ తెలిపిన ఇతర వివరాలు..

  • ఇప్పటివరకు మొత్తం 30.22 కోట్ల కొవిడ్​ పరీక్షలు నిర్వహించాం.
  • రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 21.64శాతంగా ఉంది.
  • మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​​, రాజస్థాన్​, ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​, ఛత్తీస్​గఢ్​, బంగాల్​, హరియాణా, బిహార్​,మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో 82.94 శాతం క్రియాశీలక కేసులున్నాయి.
  • జాతీయ కొవిడ్​ మరణాల రేటు 1.09గా ఉంది.
  • శనివారం సంభవించిన కరోనా మరణాల్లో 74.93 శాతం 10 రాష్ట్రాల్లో నమోదైనవే. వీటిల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. కర్ణాటక తర్వాత వరుసలో ఉంది.
  • ప్రతి 10 లక్షల మందిలో కరోనాతో మరణించేవారి జాతీయ సగటు(176) కంటే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తక్కువగా ఉంది. మరో 16 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.
  • శనివారం.. కరోనాను జయించినవారిలో 75.75 శాతం 10 రాష్ట్రాలకు చెందినవారే.

మూడు రోజుల్లో రాష్ట్రాలకు 46 లక్షల టీకా డోసులు

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 72 లక్షలకుపైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో మరో 46 లక్షల డోసులను అందించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు మొత్తం 17.56 కోట్ల డోసులు ఉచితంగా ఇచ్చినట్లు పేర్కొంది. ఇందులో 16.83 కోట్ల డోసులు వినియోగించినట్లు చెప్పింది.

ఇవీ చూడండి:

దిల్లీలో మరోవారం పాటు లాక్​డౌన్ పొడిగింపు

లాక్​డౌన్​: కేరళలో పకడ్బందీ.. 'మహా'లో మాత్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.