కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం కేసులు మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, బిహార్, బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి అని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 71.81 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని పేర్కొంది.
మహారాష్ట్రలో అత్యధికంగా 62,194 కేసులు నమోదయ్యాయి. 49,058 కేసులతో కర్ణాటక.. 42,464 కేసులతో కేరళ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరణాల సంఖ్యలో కూడా మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. ఒక్క రోజే అత్యధికంగా 853 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల్లో 81.04 శాతం.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, బంగాల్, హరియాణా, బిహార్ రాష్ట్రాల్లో నమోదవేనని కేంద్రం వెల్లడించింది.
ఇదీ చదవండి : యువకుడి ప్రతిభ- సరసమైన ధరకే 'ఆక్సి-ఫ్లో మీటర్'