ETV Bharat / bharat

పది నెలల బాలికకు రైల్వే ఉద్యోగం.. అదెలాగంటే? - south east central railway bilaspur

పది నెలల బాలిక రైల్వే ఉద్యోగం సాధించింది. బాలికకు ఉద్యోగం ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు రైల్వే అధికారులు. ఎక్కడ?.. ఎందుకు?.. ఎలా?.. అన్న ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయా?.. అయితే, ఈ స్టోరీ చదివేయండి..

south east central railway bilaspur
10 నెలల బాలికకు కారుణ్య నియామకం
author img

By

Published : Jul 7, 2022, 12:03 PM IST

ఛత్తీస్​గఢ్​.. రాయ్​పుర్​లోని ఆగ్నేయ మధ్య రైల్వేలో అరుదైన కారుణ్య నియామకం జరిగింది. 10 నెలల రాధిక అనే బాలికకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ రిజిస్ట్రేషన్​ను బుధవారం పూర్తి చేశారు రైల్వే అధికారులు. బాలికకు 18 ఏళ్లు నిండాక.. రైల్వే శాఖ ఆ ఉద్యోగాన్ని ఇవ్వనుంది. ఆగ్నేయ మధ్య రైల్వే చరిత్రలో ఇంత చిన్న వయసు వారికి కారుణ్య నియామకం ఇవ్వడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.

అసలేం జరిగిందంటే: రాధిక తండ్రి రాజేంద్ర కుమార్ యాదవ్.. భిలాయ్‌లోని పీపీ యార్డ్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రాజేంద్ర.. ఛరోడాలోని రైల్వే క్వార్టర్స్​లో నివాసం ఉండేవాడు. జూన్ 1న రాజేంద్ర, అతని కుటుంబంతో కలిసి భిలాయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర, అతని భార్య మంజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి పాప ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. అప్పటి నుంచి రాధిక.. అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉంటుంది.

కారుణ్య నియామక ప్రక్రియ కోసం రైల్వే కార్యాలయానికి రాధికను ఆమె తాత, మామ బుధవారం తీసుకెళ్లారు. అనంతరం వేలిముద్రలను తీసుకుని రాధిక ఉద్యోగ రిజిస్ట్రేషన్​ను పూర్తి చేశారు రైల్వే అధికారులు. రాధికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉద్యోగంతో పాటు రైల్వే ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు పొందవచ్చని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.