Telugu Students Died in US : ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పి భారంగానే సెండాఫ్ ఇచ్చిన 17 రోజులకే మీ కుమారుడు చనిపోయాడంటూ వార్త రావటంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అద్దెకుంటున్న ఇంట్లోనే ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించటం పలు అనుమానాలకు దారితీస్తుంది. వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతులకు ఏకైక కుమారుడు దినేశ్ (23) బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. పదిహేడు రోజుల క్రితం కుటుంబసభ్యులంతా దినేశ్‌కు ఎయిర్ పోర్టుకు వెళ్లి భారమైన హృదయంతో సెండాఫ్ ఇచ్చారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి రోజుకోసారి వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. యూఎస్ వెళ్లి 17 రోజులవుతోంది. ఇంతలోనే దినేశ్ చనిపోయాడంటూ అమెరికా పోలీసుల నుంచి సమాచారం అందడంతో అతడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
అసోంలో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి
దినేశ్‌తోపాటు అదే రూంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి మరణించినట్టు, మృతుని బంధువులకు కూడా సమాచారం అందించారు. ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఇద్దరు యువకులు నిద్రలో ఉండగానే మరణించినట్టుగా అక్కడి పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించిన అనంతరమే మరణానికి గల కారణాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే వారి మృతదేహాలను ఇండియాకు పంపించనున్నట్టు వెల్లడించారు.
Wanaparthy Student Died in America : అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం ఫెయిర్ ఫీల్డ్‌లోని సేక్రెడ్ హార్ట్ విశ్వవిద్యాలయం(ఎస్‌హెచ్‌యూ)లో ఎంఎస్ చదివేందుకు గత ఏడాది డిసెంబరు 28వ తేదీన పయనమయ్యారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. వెళ్లిన పదిహేడు రోజులకే తమ కుమారుడు నిద్రలోనే చనిపోయినట్లు సమాచారం అందిందని మృతుడు దినేశ్ తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమారుడితో పాటు శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కూడా చనిపోయాడని తెలిసిందని అన్నారు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు నిద్రలోనే విగతజీవులుగా మారడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషవాయువు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని అమెరికా నుంచి సమాచారం వచ్చినట్లు చెబుతున్నారు.
అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?
హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం