రాష్ట్రానికి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారని ఆయన భార్య రినికీ భుయన్ శర్మ చెప్పారు. తన భవిష్యత్ గురించి అమ్మకు ఏం చెప్పాలని ప్రశ్నించినప్పుడు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అసోం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె ఈ విషయాలు పంచుకున్నారు.
"మేము తొలిసారి కలుసుకున్నప్పుడు నాకు 17 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్లు. మొదటిసారిగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత 2001, జూన్ 7న మాకు వివాహం అయింది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ప్రజాసేవలో ఉన్నవారు ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. హిమంత ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే నమ్మకం నాకు ఉంది."
-రినికీ భుయన్ శర్మ
ఇదీ చదవండి: అసోం కోసం హిమంత 'టాప్-5' లక్ష్యం