ETV Bharat / bharat

'మీ కథ నాతో చెప్పుకోండి.. 10 రూపాయలిస్తా'!

పంచుకుంటే బాధ తగ్గుతుందంటారు. జీవితంలో ఏదో ఒక దశలో ప్రతిఒక్కరూ తమ బాధను చెప్పుకొనేందుకు ఎవరూ లేరని కుంగిపోవడం సహజం. ఆ కుంగుబాటుతో ప్రాణాలు తీసుకునేవాళ్లూ ఉంటారు. అలాంటివారి కోసం ఓ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు పుణెకు చెందిన ఓ కుర్రాడు. మీ బాధ నాతో చెప్పుకోండి.. నేనే మీకు పది రూపాయలిస్తానంటూ ఆకట్టుకుంటున్నాడు.

Tell me your story, I will give you 10 rupees:  a young man from Pune
'మీ కథ నాతో చెప్పుకోండి.. 10 రూపాయలిస్తా'!
author img

By

Published : Feb 6, 2021, 11:18 AM IST

పుణె కుర్రాడి వినూత్న ప్రచారం

చేతిలో ప్లకార్డులు పట్టుకుని, పుణె రోడ్లపై తిరుగుతున్న ఈ యువకుడు.. ప్రస్తుతం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణ. 'మీ కథ నాతో చెప్పుకోండి, నేనే మీకు 10 రూపాయలిస్తా!' ఆ కుర్రాడు పట్టుకున్న అట్టముక్కపై రాసున్న మాటలివి. ఆ కుర్రాడి పేరు రాజ్ డగ్‌వార్. వృత్తిరీత్యా కంప్యూటర్ ఇంజినీర్ అయిన రాజ్.. మానసిక ఒత్తిడి ఎంత ప్రమాదకరమో గుర్తించాడు. అందుకే ఒత్తిడితో సతమతమవుతున్న వారికి సహాయం చేయాలనుకున్నాడు.

''మానసికంగా కుంగిపోతున్న వారు మనచుట్టూనే ఎంతోమంది ఉంటారు. తమ బాధలు చెప్పుకోవడానికి వారికి ఎవరూ ఉండరు. చెప్తే వాళ్లేమనుకుంటారో అని చాలామంది భయపడుతుంటారు. అలాంటి వాళ్లకోసమే నేనిక్కడ ఉన్నా. ఎవరైనా తమ బాధను నాతో పంచుకోవచ్చు. అలా చేస్తే 10 రూపాయలిస్తా. డబ్బు.. చిన్న సాయంగా మాత్రమే.''

- రాజ్ డగ్‌వార్

ప్రతి ఒక్కరూ ఎవరి పనులతో వాళ్లు తీరికలేకుండా గడుపుతూ, పక్కవారితో మనసారా మాట్లాడుకునే పరిస్థితులే లేని రోజులివి. అందుకే మానసిక ఆరోగ్యం గాడితప్పుతోంది. జీవితంలో వివిధ కారణాలతో మానసికంగా కుంగిపోయేవారికి సాయం చేసేందుకు.. ఓ శ్రోతగా ప్రయాణం ప్రారంభించాడు రాజ్. ఈ ఆలోచన గురించి తెలుసుకున్నవారెవరైనా రాజ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

''ఇదొక మంచి కార్యక్రమం. తమ బాధలు పైకి చెప్పుకోలేని వారు ఇక్కడికొచ్చి, ఏ బెరుకూ లేకుండా ఆ అబ్బాయితో చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్లిద్దరూ ఒకరికొకరు తెలియదు.''

- స్థానిక యువతి

రాజ్ చేస్తున్న మంచి పని పట్ల ఆయన తల్లిదండ్రులు పూర్తి సంతోషంగా ఉన్నారు. నలుగురికీ మంచి చేయాలన్న ఆశయం తమ కుమారుడిని అదే నలుగురిలో ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్తున్నారు.

''మాకు మొదట్లో వింతగా అనిపించింది. క్రమంగా ఆయన ఉద్దేశం అర్థమైంది. మా దృష్టి కోణంలోనూ మార్పొచ్చింది. ఆయన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. రాజ్ తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది.''

- రాజ్ తండ్రి

''రాజ్ అన్న తమ్ముడినని నేను గర్వంగా చెప్పుకుంటా. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా. అభినందనలు.''

- రాజ్ తమ్ముడు

ప్రశాంతంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటారు రామదాస్ స్వామి. రాజ్ నలుగురి కోసం చేస్తోంది అక్షరాలా ఇదే.

ఇదీ చూడండి: పిల్లలను ఇనుప రాడ్డుతో కొట్టి ఆపై ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.