ETV Bharat / bharat

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం - నా రాశి ఫలం గురించి చెప్పు

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు..

Horoscope
రోజు రాశి ఫలం
author img

By

Published : Aug 5, 2021, 4:50 AM IST

ఈ రోజు రాశిఫలాలు గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

మేషం

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఒక ఆత్మీయుని సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

వృషభం

చేపట్టే పనిలో శ్రమ పెరుగుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉత్సాహంగా ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులకు పోరాదు. హనుమాన్ చాలీసా పఠనం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మిథునం

చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

కర్కాటకం

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జరిపించాలి.

సింహం

శుభకాలం. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. మిత్రుల సహకారం ఉంటుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. మనః సౌఖ్యం ఉంటుంది. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

కన్య

ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. కుజ ధ్యానం శుభప్రదం.

తుల

దైవబలం విశేషంగా ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు అంశాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామ నామాన్ని జపిస్తే మంచిది.

వశ్చికం

చేపట్టే పనుల విషయంలో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారి జోలికి పోకుండా ఉండటమే మేలు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

ధనస్సు

మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మకరం

తలపెట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శనిధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభం

శరీర సౌఖ్యం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదేవత శ్లోకాలు చదివితే మంచిది.

మీనం

పట్టుదలతో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గిట్టనివారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. శివారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.