ETV Bharat / bharat

Telangana wins Green Apple Awards : తెలంగాణలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు.. సీఎం కేసీఆర్​ హర్షం

Telangana wins Green Apple Awards
Telangana wins Green Apple Awards
author img

By

Published : Jun 14, 2023, 12:57 PM IST

Updated : Jun 14, 2023, 5:54 PM IST

12:49 June 14

Five international awards for Telangana : తెలంగాణలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు

Telangana wins Five Green Apple Awards : తెలంగాణలో ఐదు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఐదు నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. లండన్​కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ మేరకు అవార్డులు ప్రకటించింది. రాష్ట్ర అంబేడ్కర్ సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మొజాంజాహీ మార్కెట్, యాదగిరిగుట్ట ఆలయానికి అవార్డులు లభించాయి. ఈ అవార్డులు రావడం పట్ల సీఎం కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు.

ఈనెల 16న అవార్డుల ప్రధానోత్సవం : పునరుద్ధరణ విభాగంలో ఎంజే మార్కెట్​కు, వినూత్న నమూనాతో వంతెన కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్​కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. సుందర నమూనా, వర్క్ స్పేస్ బిల్డింగ్ విభాగంలో సచివాలయానికి, యూనిక్ ఆఫీస్ కేటగిరీలో పోలిస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​కు అవార్డులు దక్కాయి. అద్భుతమైన అధ్యాత్మిక నిర్మాణాల విభాగంలో యాదాద్రి దేవాలయానికి గుర్తింపు లభించింది. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు లభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. లండన్​లో జరగనున్న కార్యక్రమంలో ఈ నెల 16న అవార్డులు ప్రధానం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అవార్డులు అందుకోనున్నారు.

సీఎం కేసీఆర్​ హర్షం : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ భవనం, దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి, మొజంజాహీ మార్కెట్​, సచివాలయం ఇంటర్నేషనల్​ బ్యూటీఫుల్​ బిల్డింగ్స్​ గ్రీన్​ యాపిల్​ అవార్డు అందుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్​కు చెందిన ప్రతిష్టాత్మక గ్రీన్​ ఆర్గనైజేషన్​ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు.

CM KCR Is Happy To Receive Green Apple Awards For Five Buildings In Telangana : దేశంలోనే మొదటిసారిగా ఈ గ్రీన్ అవార్డులను దక్కించుకున్న రాష్ట్రంగా నిలవడం ద్వారా తెలంగాణతో పాటు దేశ ఖ్యాతి ఖండాంతరాలు తాకిందని కేసీఆర్ తెలిపారు. నూతన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా కట్టడాల నిర్మాణం, పునరుద్దరణ జరుగుతున్నదని.. అందుకు ఈ అవార్డులే నిదర్శనమని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

Green Apple Awards 2023 : సకల జనుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ఆదర్శ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ఆచరిస్తున్న ప్రగతి దారులను దేశం అనుసరిస్తోందన్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు తెలంగాణకు వెల్లువెత్తుతున్న విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. అవార్డులకు కృషి చేసిన ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 14, 2023, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.