TS Police Results 2023 : తెలంగాణలో పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు అర్హత సాధించిన వారి గణాంకాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది. మొత్తం విడుదల చేసిన పోస్టులకు గానూ 84 శాతం మంది అర్హత సాధించినట్లు బోర్డు తెలిపింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్లు టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది.
కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 4,564 మంది, ఎస్సై సివిల్ 43,708 మంది, ఎస్సై ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్‌కు 283 మంది చొప్పున అర్హత సాధించినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈరోజు రాత్రి నుంచి అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు వెబ్సైట్లో పెడతామని నియామక మండలి వెల్లడించింది.
Telangana State Police Results 2023 : ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్సైట్లో తమ తమ వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. దీంతో పాటుగా రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు కూడా నియామక మండలి అవకాశం కల్పించింది. రీకౌంటిగ్ లేదా రీ వెరిఫికేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ.2000, ఇతరులకు రూ.3000 ఫీజు నిర్ణయించింది. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ ఒకటో తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకూ అభ్యర్థులకు బోర్డు అవకాశం కల్పించింది. రీ-కౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదలైన అనంతరం.. అభ్యర్థుల అప్లికేషన్ కరెక్షన్కు అవకాశం కల్పించనున్నట్లు నియామక మండలి పేర్కొంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వివరాల తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తామని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది.
TS Constable Final Exams Competition Information : తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఏప్రిల్ 30న జరిగింది. తుది పరీక్షల్లో.. లక్షా 9 వేల 663 మంది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గానూ.. లక్షా 8 వేల 55 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థుల్లో 6 వేల 801 మందికి గానూ 6 వేల 88 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 98.53 శాతం, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 89.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఇవీ చదవండి :