Telangana New Cabinet Ministers : తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు మంత్రులకు శాఖలను (New Cabinet Ministers) కేటాయించారు. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారంటే?
మంత్రులకు శాఖలు కేటాయింపు
- భట్టి విక్రమార్క - ఆర్థిక, ఇంధన శాఖ :
- తుమ్మల నాగేశ్వరరావు - వ్యవసాయ, చేనేత శాఖ :
- జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్, పర్యాటక శాఖ :
- ఉత్తమ్ కుమార్ రెడ్డి - నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ :
- దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ :
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ :
- శ్రీధర్‌బాబు - ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాలు :
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ :
- పొన్నం ప్రభాకర్ - రవాణా, బీసీ సంక్షేమ శాఖ :
- సీతక్క - మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ :
- కొండా సురేఖ - అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ :
- రేవంత్‌రెడ్డి వద్దే హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు
CM Revanth Reddy Discussion on Telangana Cabinet : మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించారు. తొలుత రేవంత్ రెడ్డి కేసీవేణుగోపాల్ నివాసానికి వెళ్లారు కొద్దిసేపటికి మాణిక్‌రావు ఠాక్రే, రోహిత్ చౌదరి అక్కడకి వచ్చారు. రాత్రి 10.30 గంటల వరకు మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు.
కీలకశాఖల్లో ఎవరికి ఏం కేటాయించాలనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేశారు. శాఖలు, ప్రొటోకాల్‌లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడాలనే అంశంపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిసింది. మరో ఆరుగురికి మంత్రి పదవులు కేటాయించాల్సి ఉండడంతో ఆ అంశంపైనా చర్చలు సాగినట్లు సమాచారం. ఆ తర్వాత ముఖ్యమంత్రి, కేసీ, మాణిక్‌రావు ఠాక్రే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపుపై చర్చించిన అంశాలను ఆయనకు వివరించారు. శాఖలకు సంబంధించి ఖర్గే కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు తెలిసింది. కాసేపటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అక్కడకు వచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకు భేటీ కొనసాగింది. శాఖల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరడంతో ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
నేడు తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్షా భేటీ - శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఎన్నుకునే అవకాశం!
నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం - మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి