Telangana Govt Letter to KRMB Chairman : గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వినియోగించుకున్న జలాలను ఈ ఏడాదికి జమ చేయాలని.. తదుపరి త్రిసభ్య కమిటీ సమావేశంలో వాటిని పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ రాష్ట్రం కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఏపీ ప్రతి ఏడాది కృష్ణా జలాలను వాటాకు మించి వాడుకుంటోందని.. 2022-23లో చెరి సగం నిష్పత్తిన చూస్తే 205 టీఎంసీలను.. 34:66 నిష్పత్తిలో 51 టీఎంసీలను ఎక్కువగా తీసుకొందని లేఖలో పేర్కొన్నారు. సమర్థంగా నీటిని వాడుకొని తదుపరి అవసరాల కోసం తెలంగాణ తన వాటాలోని నీటిని ఉమ్మడి జలాశయాల్లో నిల్వ చేసినట్లు తెలిపారు.
ENC Muralidhar letter to KRMB Chairman : ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు లేనందున గత ఏడాది 18.7 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వ చేసుకున్నామని.. 2023-24 తొలి సీజన్లో తాగు, సాగు నీటి అవసరాలకు వాటిని వినియోగించుకోవాలన్నది తమ ప్రణాళిక అని వివరించారు. ఇదే విషయాన్ని గతంలోనే బోర్డుకు కూడా నివేదించినట్లు తెలిపారు. క్యారీ ఓవర్‌ను ప్రస్తుత ఏడాది రాష్ట్ర వాటాగా కూడా పరిగణలోకి తీసుకోరాదని ఈఎన్సీ కోరారు. ట్రైబ్యునల్ ముందు నివేదించిన ప్రకారం సాగర్ కింద ఏపీకి ఏడాది తాగు నీటి అవసరాలకు కేవలం 2.84 టీఎంసీలు మాత్రమే అవసరమని.. కానీ, 5 టీఎంసీలు ఇవ్వాలని కోరినట్లు లేఖలో గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో చెరిసగం వాటా కావాలన్న తమ డిమాండ్ నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖను నివేదించాలని 17వ బోర్డు సమావేశంలో నిర్ణయించారని.. నివేదనకు సంబంధించిన ప్రతిని తమకు ఇవ్వాలని తెలంగాణ కోరింది. 2023-24 సంవత్సరానికి నీటి కేటాయింపులను ఖరారు చేసే సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ
Telangana Urges to KRMB to Stop Extra Water AP : గతంలో బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో చిన్న నీటి వనరులను మినహాయించి మిగిలిన నీటిని 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వినియోగించుకొంటున్నాయి. ఆ జలాలను వచ్చే నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు ఉండాలని రాష్ట్రం కోరింది. ఈ అంశంపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ విషయంలో నిర్ణయం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని కేఆర్ఎంబీ ఛైర్మన్ ప్రకటించారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చే వరకు నీటి విడుదలపై ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకొంటుందని తెలిపారు. ఈ కమిటీలో బోర్డు సభ్యుడితో పాటు రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు సభ్యులుగా ఉన్నారు. 2022-23వ నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం ఉండాలని తెలంగాణ ప్రతిపాదించింది. దీనిపై తీవ్రస్థాయిలో ఇరు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్‌కి 512, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకొనేలా 2015లో అవగాహన కుదిరింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అదే పద్ధతి కొనసాగుతోంది.
Rajathkumar on Krishna River Water Allocation : 'జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాల్సిందే'
KRMB Meeting Update : వర్చువల్‌గా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ ఈఎన్సీ
Telangana Govt letter to KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ