ETV Bharat / bharat

School Holidays : భారీ వర్షాల ఎఫెక్ట్​.. నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు

school
school
author img

By

Published : Jul 25, 2023, 9:19 PM IST

Updated : Jul 26, 2023, 6:24 AM IST

21:12 July 25

School Holidays : భారీ వర్షాల నేపథ్యంలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు

School Holidays In Telangana : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నందున.. నేడు, రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు బుధ, గురు వారాలు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం ఆదేశించారు. దాదాపు అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికను జారీ చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్​ అలర్ట్​ను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ.. విద్యాశాఖను ఆదేశించారు.

Telangana School Holidays : గతవారం కూడా కేవలం జీహెచ్​ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలకు మూడు రోజులు సెలవు మంజూరు చేశారు. సీఎం కేసీఆర్​ సచివాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టుల వద్ద ప్రవాహం, ఎలాంటి చర్యలు తీసుకున్నారు. గ్రామాలలో చెరువుల పరిస్థితి వంటి అత్యవసర పరిస్థితులపై చర్చించారు.

వర్షాల నేపథ్యంలో జీహెచ్​ఎంసీ సిబ్బంది అప్రమత్తం​ : రాష్ట్రంలో ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో నగరంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ అదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని సర్కిళ్లల్​లో పని చేస్తున్న కార్యనిర్వహక ఇంజినీర్లతో వైర్ లెస్ సెట్ల ద్వారా మేయర్ సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

School Holidays : మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు 428 ఏర్పాటు చేసిన నేపథ్యంలో రోడ్డుపై నిలిచిన నీరును వెనువెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాల నేపథ్యంలో ఇంటి నుంచి అత్యవసరం ఉన్నప్పుడే బయటికి రావాలని నగర వాసులను కోరారు. వర్షంలో ఇబ్బందులు, సమస్యలు సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 040- 21111 111 నంబర్ డయల్ చేయాలన్నారు. డీఆర్​ఎఫ్ బుద్ధ భవన్​లో హెల్ప్ లైన్ కంట్రోల్ రూం మొబైల్ నంబర్ 9000113667కు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. గుర్తించిన శిథిలావస్థలో ఉన్న గృహాలపై ఎక్కువ దృష్టి సారించలన్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పరిధిలో పని చేసే అధికారులకు సిబ్బందికి అత్యవసరం ఉంటే తప్ప ఎవ్వరికీ సెలవులు ఇవ్వ వద్దని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 26, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.