- " class="align-text-top noRightClick twitterSection" data="">
Telangana Assembly Election Results 2023 Live Updates : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేశారు. ప్రస్తుతం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లు సహా తొలి రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఖమ్మం, పాలేరు, మధిర పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రావు, భట్టి విక్రమార్క ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Congress Leads Postal Ballots Telangana 2023 : నల్గొండ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి, పరకాల పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్, వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు ముందంజలో ఉన్నారు. ములుగులో సీతక్క, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, సిద్దిపేట పోస్టల్ బ్యాలెట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు ముందంజ వేశారు.
ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపులోనూ తొలి రౌండ్‌లో హస్తం పార్టీ అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ తొలి రౌండ్‌లో ముందంజ వేశారు. తొలి రౌండ్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 2,380 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్నారు. ముషీరాబాద్‌లో బీఆర్ఎస్లో అభ్యర్థి ముఠా గోపాల్ కొనసాగుతుండగా.. గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజలో ఉన్నారు. ఇక తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి సామేలు, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు, మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ముందంజలో కొనసాగుతున్నారు.
- నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి ఆలేటి మహేశ్వర్ రెడ్డి ముందంజ
- జుక్కల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి షిండే ముందంజ
- భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణరావు ముందంజ
- చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేకానంద ముందంజ
- మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్ ముందంజ
- వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ముందంజ
- ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఐలయ్య ముందంజ
- సత్తుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర ముందంజ
- కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ముందంజ
- పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ముందంజ
- వైరాలో కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ ముందంజ
- ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి శంకర్ ముందంజ
- రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ ముందంజ
- కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి ముందంజ
- దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి ముందంజ
- కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని ముందంజ
- మక్తల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి ముందంజ
- నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ముందంజ
- జుక్కల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి షిండే ముందంజ
- భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణరావు ముందంజ
- శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాంధీ ముందంజ
- జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ముందంజ
- హుస్నాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ముందంజ
- బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ముందంజ
- ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్ ముందంజ
- మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్ ముందంజ
- నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరెడ్డి ముందంజ
- అంబర్‌పేటలో భారాస అభ్యర్థి వెంకటేశం ముందంజ
- కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ముందంజ
- మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ముందంజ
- ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ముందంజ
- మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ ముందంజ
- నర్సంపేటలో భారాస అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి ముందంజ
- నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జె.వి.రెడ్డి ముందంజ
- మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్‌రావు ముందంజ
- నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి ముందంజ
- డోర్నకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ
- కోరుట్లలో భారాస అభ్యర్థి సంజయ్ ముందంజ
- పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ముందంజ
పరకాల భారాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ముందంజ - సిద్దిపేటలో భారాస అభ్యర్థి హరీశ్‌రావు ముందంజ
- చార్మినార్‌లో బీజేపీ అభ్యర్థి 2539 ఓట్లతో ముందంజ
- బోధ్‌లో భారాస అభ్యర్థి అనిల్ జాదవ్ ముందంజ
- స్టేషన్‌ఘన్‌పూర్‌లో భారాస అభ్యర్థి కడియం శ్రీహరి ముందంజ
- శేరిలింగంపల్లిలో భారాస అభ్యర్థి గాంధీ ముందంజ
Telangana Elections Postal Ballot Votes Results 2023 : తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ల మధ్యే హోరాహోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే 60 సీట్లు సాధించాల్సి ఉంది.