ETV Bharat / bharat

కాంగ్రెస్​ను వీడిన ఎమ్మెల్యేలకు కన్నీళ్లే - బీఆర్​ఎస్​లో చేరిన వారిలో ఎందరు ఓడారో తెలుసా? - Telangana Assembly Election Results

Telangana Assembly Election Results 2023 Live: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించింది. బీఆర్​ఎస్​ను తక్కువ స్థానాలకే పరిమితం చేసిన కాంగ్రెస్​.. మేజిక్​ ఫిగర్​ దాటి ఎన్నికల్లో గెలిచింది. దీంతో కాంగ్రెస్​ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే.. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత కారెక్కిన సంగతి తెలిసిందే. వారంతా.. ఈ సారి బీఆర్ఎస్​ తరపున బరిలో నిలిచారు. ఇందులో చాలా మంది ఓడిపోయారు!

Telangana Assembly Election Results 2023 Live

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:01 PM IST

Telangana Assembly Election Results 2023 Live BRS Sitting MLAs Defeated Who Leave Congress: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో తేలిపోతున్నారు. అయితే.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత కారెక్కిన సంగతి తెలిసిందే. వారంతా.. ఈ సారి బీఆర్ఎస్​ తరపున బరిలో నిలిచారు. అయితే.. ఇందులో 9 మంది ఓటమిపాలయ్యారు. వారెవరు? ఏయే నియోజకవర్గాల్లో పోటీలో నిలిచారు? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

కందాళ ఉపేందర్ రెడ్డి : 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం గులాబీ పార్టీ నుంచి బరిలో నిలిచిన కందాళ.. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

రేగా కాంతారావు : పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత కాలంలో కారెక్కారు. ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయారు. 2018లో పాయం టీఆర్ఎస్​ తరపున.. రేగా కాంగ్రెస్ తరపున పోటీచేశారు.

బీఆర్ఎస్ మార్చిన అభ్యర్థుల్లో.. గెలిచిందెవరు? ఓడిందెవరు??

వనమా వెంకటేశ్వరరావు : 2018లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా కాంగ్రెస్​ తరపున గెలిచారు వనమా. ఆ తర్వాత గులాబీ కండువా మెడలో వేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్​ అభ్యర్థిగా పోటీచేసిన ఆయనపై.. సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. సీపీఐకి కాంగ్రెస్​ మద్దతు ఇచ్చింది.

హరిప్రియా నాయక్ : ఇల్లెందు నియోజకవర్గంలో హరిప్రియ కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇప్పుడు బీఆర్​ఎస్ తరపున బరిలో నిలిచిన ఆమె.. కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య చేతిలో ఓడిపోయారు. 2018లో వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉన్నారు. టీఆర్ఎస్​ నుంచి కనకయ్య, కాంగ్రెస్ నుంచి హరిప్రియ పోటీచేశారు.

Telangana Women MLAs List : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మహారాణులు వీరే - ఎంతమంది మహిళలు గెలిచారో తెలుసా?

చిరుమర్తి లింగయ్య : నకిరేకల్ నియోజకవర్గంలో లింగయ్య కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్​ఎస్​ నుంచే బరిలో నిలిచిన ఆయనపై.. కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం విజయం సాధించారు. 2018లో వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉన్నారు. అప్పుడు టీఆర్​ఎస్​ నుంచి వీరేశం, కాంగ్రెస్ నుంచి లింగయ్య పోటీచేశారు.

జాజుల సురేందర్ : 2018లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జాజుల సురేందర్ కాంగ్రెస్ తరపున పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత గులాబీ దళంలో చేరారు. ఇప్పుడు బీఆర్​ఎస్​ నుంచే పోటీచేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి మదనమోహనరావు చేతిలో ఓడిపోయారు.

బీరం హర్షవర్ధన్ రెడ్డి : కొల్లాపూర్ నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్​ నుంచే బరిలో నిలిచిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో వీరిద్దరూ ప్రత్యర్థులుగా ఉన్నారు. జూపల్లి టీఆర్ఎస్​ నుంచి.. హర్షవర్ధన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.

కాంగ్రెస్​ను విజయతీరాలకు నడిపించిన మాస్టర్​ మైండ్​ ఎవరిది? ఆయన సక్సెస్​ మంత్ర తెలుసా?

పైలెట్ రోహిత్ రెడ్డి : తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇప్పుడు బీఆర్​ఎస్​ పార్టీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

గండ్ర వెంకటరమణా రెడ్డి : భూపాలపల్లి నియోజకవర్గంలో వెంకటరణారెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత కారెక్కారు. ఇప్పుడు బీఆర్ఎస్​ తరుపున బరిలో నిలిచిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ రావు చేతిలో ఓటమి పాలయ్యారు.

'కౌన్​ బనేగా సీఎం?'- మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరంటే?

వీళ్లు కూడా...
సండ్ర వెంకటవీరయ్య : సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించారు. అనంతర కాలంలో టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు గులాబీ పార్టీ నుంచే బరిలో నిలిచిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి చేతిలో ఓడిపోయారు.

మెచ్చా నాగేశ్వరరావు : అశ్వారావుపేట నియోజకవర్గంలో మెచ్చా తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించారు. అనంతర కాలంలో గులాబీ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే బరిలో నిలిచిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు.

Telangana Election Result 2023 LIVE: కాంగ్రెస్​కు కలిసొచ్చిన వారసత్వ రాజకీయం - విజయతీరాలకు ఆ కుటుంబాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.