ETV Bharat / bharat

ఓడింది మహాకూటమే.. 'తేజస్వీ' కాదు!

తేజస్వీ యాదవ్​... ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పేరిది. బిహార్​ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ.. తేజస్వీ శ్రమను యావత్​ భారత దేశం చూసింది. లాలూ ప్రసాద్​ యాదవ్​ గైర్హాజరుతో ఆర్​జేడీని తేజస్వీ నడిపించిన తీరును ప్రజలు ప్రశంసించారు. ఓటమికి అడుగు దూరంలో నిలిచినప్పటికీ.. బిహార్-2020 ​ ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Tejaswi emerged as a true leader in 2020 Bihar elections
ఓడింది మాహాకూటమే.. 'తేజస్వీ' కాదు!
author img

By

Published : Nov 10, 2020, 9:52 PM IST

Updated : Nov 10, 2020, 10:32 PM IST

రాజకీయాల్లో తలపండిన ఎన్​డీఏ దిగ్గజ నేతలు ఓవైపు.. వాళ్ల అనుభవమంత వయసు కూడా లేని 31ఏళ్ల యువనేత మరోవైపు. ఇది బిహార్ ఎన్నికల సమరంలో దేశప్రజలు చూసింది. మహాకూటమిని విజయతీరానికి చేర్చడంలో త్రుటిలో విఫలమైనప్పటికీ.. ఇప్పుడు అందరిచూపు... ఆ యువనేతపైనే. ఆయనే.. ఆర్​జేడీ 'యువశక్తి' తేజస్వీ యాదవ్​.

యువరక్తం...

తేజస్వీ యాదవ్​... లాలూ తర్వాత ఆర్‌‌జేడీ లాంతర్ పట్టుకునే వాళ్లెవరా? అని బిహార్‌‌లో జనం ఎదురుచూస్తున్న దశలో ముందుకొచ్చారు. మోదీ మేనియా, నితీశ్​ విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ పార్టీని ముందుకు నడిపించారు. తన తండ్రి లాలూ ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో లేని లోటును భర్తీ చేసేందుకు ఈ యువ నేత శక్తి వంచన లేకుండా కృషి చేశారు.

ఇవన్నీ చూస్తుంటే.. ఈ ఎన్నికలు కలిసిరాకపోయినా.. రానున్న రోజుల్లో తేజస్వీ ఓ అసాధారణ నేతగా ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు.

జాతీయ స్థాయిలో మోదీకి ఉన్న ఇమేజ్​ తెలియనిది కాదు. అయితే బిహార్​లో ప్రస్తుతం తేజస్వీ యాదవ్ అదే స్థాయి ఇమేజ్​ను సంపాదించారు. ఎందుకంటే బిహార్ -2020 ఎన్నికలంతా.. 'తేజస్వీ x మిగిలిన నేతలు'గా నడిచింది.​

మోదీ నోట తేజస్వీ మాట..

2014 లోక్​సభ ఎన్నికలు మొత్తం మోదీ చుట్టూ ఎలా తిరిగాయో ఇప్పుడు 2020 బిహార్​ శాసనసభ సమరం తేజస్వీ చుట్టూ తిరిగింది. మోదీ నుంచి నితీశ్​ వరకు ఎన్​డీఏ నేతలందరూ తేజస్వీ పేరు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయలేదు. తేజస్వీ చేసే విమర్శలపై ప్రతిదాడి చేశారు. ఫలితంగా... అప్పటి వరకు ఎన్​డీఏ నేతలకు విమర్శనాంశాలుగా ఉన్న లాలూ కుంభకోణాలు సహా ఇతర విషయాలు మరుగున పడిపోయాయి. తేజస్వీపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకే నేతలు మొగ్గు చూపారు. వ్యక్తిగత విషయాల జోలికి ఎప్పుడూ వెళ్లని నితీశ్​ సైతం ఒక్కోసారి సహనం కోల్పోయారు.

అగ్రనేతలందరూ ఓ యువనేతపై ఈ స్థాయిలో విరుచుకుపడటాన్ని చూస్తే చాలు.. రాష్ట్ర రాజకీయాల్లో తేజస్వీ ముద్ర ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. మోదీ మాటల తూటాలను, నితీశ్​ విమర్శనాస్త్రాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ తేజస్వీ ముందుకు సాగిన తీరు.. అనేకమంది మన్ననలు పొందింది.

Last Updated : Nov 10, 2020, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.