ETV Bharat / bharat

Tejashwi Yadav: ఘనంగా తేజస్వీ యాదవ్‌ వివాహం.. అఖిలేశ్‌ హాజరు - లాలూప్రసాద్‌ యాదవ్‌ న్యూస్

Tejashwi Yadav Marriage: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకలకు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

tejashwi yadav marriage
తేజస్వీయాదవ్‌ వివాహం
author img

By

Published : Dec 9, 2021, 10:12 PM IST

Tejashwi Yadav Wedding: ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ ఓ ఇంటివాడయ్యాడు. హిందూ సంప్రదాయం ప్రకారం దిల్లీకి చెందిన రేచల్‌(రాజేశ్వరీ యాదవ్‌)తో ఆయన వివాహం జరిగింది. దిల్లీలో అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ దంపతులు, రాజ్యసభ ఎంపీ మీసా భారతి సహా పలువురు ప్రముఖులు, నేతలు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

tejashwi yadav marriage
తేజస్వీయాదవ్‌ వివాహం
tejashwi yadav marriage
వివాహ వేడుకకు హాజరైన అఖిలేశ్ యాదవ్

Tejashwi Yadav Marriage: తేజస్వీ సోదరి రోహిణి ఆచార్య పెళ్లి ఫొటోలను ట్వీట్‌ చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి నేడు నిశ్చితార్థం అని వార్తలు రాగా.. మంగళవారం రాత్రే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ తంతును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వేడుక నేపథ్యంలో వేదిక ప్రాంగణం బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రవేశమార్గాల వద్ద పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాకే, లోపలికి అనుమతించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.