సినిమా చూస్తుండగా తన తల్లి.. టీవీ ఆఫ్ చేసిందని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని కేజ్ తెహ్సిల్లో జరిగింది.
శనివారం ఉదయం వకిలవాడి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది..
ఆన్లైన్ క్లాసులు ముగిశాక నేలపై పడుకుని టీవీ చూస్తున్నాడు 19 ఏళ్ల విద్యార్థి. సరిగ్గా కూర్చుని టీవీ చూడాలని తన తల్లి హెచ్చరించింది. కాసేపయ్యాక టీవీ ఆఫ్ చేసింది. అంతే.. నేరుగా బాత్రూమ్కు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ బాత్రూమ్ నుంచి బయటకు రావటం లేదని చూస్తే ఆత్మహత్య చేసుకుని తాడుకు వేలాడుతూ కనిపించాడు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి:కుంభమేళాలో అగ్ని ప్రమాదం.. ఇళ్లు దగ్ధం