ETV Bharat / bharat

బాలికకు మత్తుమందిచ్చి.. గర్భవతిని చేసి - బాలికకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం

అభం శుభం ఎరుగని ఓ బాలికకు మాదకద్రవ్యాలివ్వడమే కాక గర్భవతి అయ్యేందుకు కారణమైందో మహిళ. బాలికకు మత్తుమందిచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన అమానుష ఘటన హరియాణాలో జరిగింది. సదరు చిన్నారిపై ముగ్గురి కంటే ఎక్కువమంది అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.

drugged and raped
బాలికకు మత్తుమందిచ్చి.. గర్భవతిని చేసి
author img

By

Published : Apr 16, 2021, 9:11 AM IST

ఓ బాలికకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కీచకులు. ఈ ఘటనలో సదరు బాలిక గర్భవతి అయింది. బాలిక ఇంటి పరిసరాల్లో నివసించే మహిళను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా తేల్చారు పోలీసులు.

హరియాణాలో కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోన్న బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమె ఆరు నెలల గర్భవతి అని తేలింది. దీంతో తనపై జరిగిన లైంగిక దాడి గురించి బాలిక వివరించగా ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

డ్రగ్స్​ ఇచ్చి..

తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నిందితురాలైన మహిళ తనను బయటికి తీసుకెళ్లి.. వేరే మహిళ ఇంట్లో ఉంచేదని ఆ బాలిక పోలీసులకు వివరించింది. అక్కడ డ్రగ్స్ ఇచ్చి వేర్వేరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడేవారని తెలిపింది.

మాదకద్రవ్యాలకు బానిసైన ఆ మహిళ డబ్బు సంపాదించడానికి బాలికను ఉపయోగించుకుందని పోలీసులు వివరించారు. ఈ క్రమంలో మాయమాటలతో బాలికకు మత్తుమందిచ్చి గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతుండగా ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతులకు గదిని అద్దెకిచ్చిన మహిళ, ఆమె భర్త సహా.. మరో మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ఇతర పిల్లలను ఈ తరహా లైంగిక అవసరాలకు నిందితులు ఉపయోగించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: పనిచేసే చోట 8 ఏళ్ల బాలికపై అత్యాచారం!

ముగ్గురు చిన్నారులపై అత్యాచారం- నిందితుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.