ETV Bharat / bharat

బాలికలతో అర్ధనగ్న డ్యాన్స్​లు వేయించిన టీచర్​.. ఆఖరికి.. - బిహార్ లేటెస్ట్ రేప్ కేసు

విద్యార్థులకు పాఠాలు చెప్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. కన్న బిడ్డల్లా భావించాల్సిన విద్యార్థినిలతో అభ్యంగా ప్రవర్తించాడు. అభంశుభం తెలియని బాలికల చేత బలవంతంగా అర్ధనగ్న డ్యాన్స్​లు చేయించాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ టీచర్​ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

teacher molested students
teacher molested students
author img

By

Published : Mar 19, 2023, 12:41 PM IST

Updated : Mar 19, 2023, 2:31 PM IST

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తన విధులను మరిచి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​ టీచర్​.. బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్స్​లు చేయించాడు. వాటిని వీడియోలు తీసి ఆనందించాడు. స్కూల్​లో​ జరిగిన ఈ విషయం గురించి బయట ఎవరికి చెప్పవద్దని వారిని కొట్టి మరీ బెదిరించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే..?
జబల్​పుర్​ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రామ్​సింగ్​ ఠాకూర్​ అనే టీచర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే రామ్​సింగ్​ మార్చి 11న.. 4, 5వ తరగతి చదువుతున్న కొందరు బాలికలతో పాఠశాల గదిలో బలవంతంగా అర్ధనగ్నంగా డ్యాన్య్​లు చేయించాడు. ఇష్టం లేకపోయినా సరే టీచర్​ బలవంతంతో బాలికలు డ్యాన్సులు చేశారు. పిల్లలు చేసిన ఆ నృత్యాలను ఆ టీచర్ తన ఫోన్​లో వీడియోలు తీశాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని కర్రతో కొట్టి మరీ బెదిరించాడు. అయితే ఓ బాలిక భాదపడుతూ తన తల్లితో జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో విషయం బయటకు రాగా మరో బాలిక కూడా స్కూల్​లో బలవంతంగా డ్యాన్స్​లు చేసినట్లు తన తల్లికి చెప్పింది. దీంతో టీచర్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు జరిగిన విషయంపై స్కూల్​ ప్రధానోపాధ్యాయురాలికి తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఆమె బాధిత కుటుంబీకులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామ్​సింగ్​పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్​ చేసి.. మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్కూల్​లో ఏ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా లేని టైమ్​లో ఆ టీచర్​ ఇలా ఎందుకు డ్యాన్స్​లు చేయించాడనే దానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
బిహార్​లోని సహర్సా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ కామాంధుడు 6 ఏళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి.. అత్యాచారం చేశాడు. అనంతరం ఆ చిన్నారిని హత్య చేశాడు. మార్చి 16న తప్పిపోయిన బాలిక రెండు రోజుల తర్వాత ఊరి చివరన ఉన్న మొక్కజొన్న పొలంలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగిందంటే..?
మార్చి 16 రాత్రి ఆ చిన్నారి తన తండ్రితో కలిసి భోజనం చేసింది. అదే సమయంలో పక్కింటికి వచ్చిన ఓ వ్యక్తి.. పొరుగునే ఉన్న చిన్నారి ఇంటికి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత చిన్నారి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రెండు రోజుల తర్వాత ఆ చిన్నారి ఊరి చివరన ఓ మొక్కజొన్న పొలంలో సజీవంగా పడి ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించారు. వెంటనే చిన్నారి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పక్కింటికి వచ్చిన వ్యక్తే తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు మృతురాలి తండ్రి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Last Updated : Mar 19, 2023, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.