TDP Motha Mogiddam Program Across Telangana : హైదరాబాద్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. నగరంలో పార్టీ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. మోత మోగిద్దాం (Motha Mogiddam Program) కార్యక్రమంలో భాగంగా కంచాలు, డప్పులు, ఈలలు, హారన్ల శబ్దాలతో నినదించారు. చంద్రబాబు నివాసం వద్ద భవనేశ్వరి మోతమోగిద్దాం కార్యక్రమంలో పాల్గొని డ్రమ్స్ కొట్టారు. అమీర్‌పేట కీర్తి అపార్ట్‌మెంట్స్ వాసులు.. చంద్రబాబుకు మద్దతుగా వివిధ ధ్వనులతో నినదించడంతో.. ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ఇందులో నందమూరి సుహాసిని పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Chandrababu Arrest : మియాపూర్‌లోని ఎస్ఆర్ ఎస్టేట్స్ వద్ద టీడీపీ శ్రేణులు విజిల్స్, బైకుల హారన్లు మోగిస్తూ నినదించారు. కూకట్‌పల్లి పరిధిలోని మోతీనగర్‌లో తెలుగుదేశం కార్యకర్తలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మద్దతు పలికారు. ఇప్పటికైనా చంద్రబాబును నిర్బంధం నుంచి విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగు తమ్ముళ్లు వివిధ రకాల శబ్దాలతో హోరెత్తించారు. జగన్ సర్కార్‌కి ఇప్పటికైనా కనువిప్పు కలగాలంటూ శబ్దహోరుతో హడలెత్తించారు.
TTDP Leaders Participated in the Motha Mogiddam Program : ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబుకు మద్దతుగా మోత మోగించారు. తెలుగురాష్ట్రాల అభ్యున్నతికి పాటుపడిన నేతను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే జగన్‌కు ఓటుతో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఖాయమని హెచ్చరించారు. పలు జిల్లాల్లోనూ తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు మోతమోగిద్దాం కార్యాక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
We Stand with CBN Programme in Kuwait : 'చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంలా విడుదలవుతారు'
నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఈలలు, హారన్ల శబ్దాలతో.. తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబుకు మద్దతు తెలిపారు. బోధన్ అంబేడ్కర్ చౌరస్తాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈలలు ఊదుతూ నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో తెలుగుదేశం కార్యాలయం వద్ద వివిధ శబ్దాలు చేస్తూ కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ పార్టీ కార్యాలయం పార్టీ నేత వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మోతమోగిద్దాం పెద్దపెట్టున నిర్వహించారు.
ఓరుగల్లులో మోత మోగిద్దాం కార్యక్రమాన్ని.. జిల్లా తెలుగుదేశం శ్రేణులు అదరగొట్టారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ.. వరంగల్ జిల్లా పార్టీ శ్రేణలు రోడ్లపైకి వచ్చి శబ్దాలు చేశారు. హనుమకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద.. పశ్చిమ నియోజకవర్గ శ్రేణులు ఈలలు మోగ్రించి, చప్పట్లు కొట్టి తమ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ సీఎంకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. అక్రమంగా కేసులు బనాయించిన జగన్‌కు.. తప్పు తెలుసుకునే రోజు వస్తుందని అన్నారు. ఎన్ని నిందలు మోపినా, ఎన్ని కేసులు బనాయించినా.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పేర్కొన్నారు. ఇటు ఏకశిలాపార్క్ వద్ద.. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు.. ఈలలు మోగ్రించి శబ్దాలు చేస్తూ.. మోత మోగిద్దాం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖమ్మంలో టీడీపీ కార్యకర్తలు మోత మోగించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజిల్స్, స్టీల్ ప్లేట్లు, గంటలు వాహనాల శబ్దాలతో భారీ శబ్దాలు చేశారు.
TDP Motha Mogiddam Program: చంద్రబాబుకు మద్దతుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మోగిన మోత..
Harish Rao on Chandrababu Arrest : 'ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం'