TDP Leaders Protest Over Remand For CBN: అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సవితను అరెస్టు చేసేందుకు యత్నించగా పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు.
TDP Leaders Agitation Across State: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారిపై తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కందుకూరులో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఒంగోలులో టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో నియోజకవర్గ ఇంఛార్జ్ వర్లకుమార్ రాజా ఆధ్వర్యంలో విజయవాడ-మచిలీపట్నం రహదారిపై ధర్నా నిర్వహించారు. మైలవరంలో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన నిర్వహించారు.
TDP Leaders Protest Over Remand For Chandrababu: చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో భావోద్వేగానికి గురై నందిగామ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కంటతడి పెట్టుకున్నారు. నందిగామలో పోలీసులు టీడీపీ కార్యాలయంలోకి రావడంతో వారితో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతల ఆందోళనతో పార్టీ కార్యాలయం నుంచి పోలీసులు వెనుదిరిగారు. పోలీసుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిరుమామిళ్ల కృష్ణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
TDP Leaders Protest: అవనిగడ్డలో టీడీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్ స్పష్టంచేశారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎన్టీఆర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
TDP Leaders Protest Across State: మరకట్టు సర్పంచి ఎల్లప్ప రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అమలాపురంలో వర్షంలోనూ టీడీపీ నేతలు అర్ధనగ్నంగా నిరసనను కొనసాగించారు. పార్వతీపురంలో ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నేత జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కిష్టప్పేటలో కొవ్వొత్తులతో నేతలు నిరసన చేపట్టారు. నంద్యాలలో టీడీపీ నేతలు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
Arguments in ACB Court: లాయర్ అవతారమెత్తిన చంద్రబాబు.. తన కేసును తానే వాదించుకున్న టీడీపీ అధినేత