ETV Bharat / bharat

ఎన్నికల గెలుపుతో టీడీపీ శ్రేణుల సంబరాలు.. ఘనంగా విజయోత్సవ ర్యాలీలు - TDP Leaders Celebration

TDP Leaders Celebrations : రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ రెండు చోట్ల విజయం సాధించటంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో తెలిపోయాయి. టీడీపీ విజయం సాధించటంతో ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి.. రంగులు చల్లుకుంటూ సంబరాల్లో తెేలిపోయారు.

తెలుగుదేశం సంబరాలు
తెలుగుదేశం సంబరాలు
author img

By

Published : Mar 18, 2023, 8:05 AM IST

TDP Winning In MLC Elections: ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకోవడంతో.. పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవరావు ఘనవిజయం సాధించడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీపీ నాయకులు కేక్‌లు కట్‌ చేసి.. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. చిరంజీవరావు విజయాన్ని పురస్కరించుకుని విశాఖ గండి బాబ్జి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అనకాపల్లిలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సంబరాల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టీడీపీ కార్యకర్తలు విజయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ విజయాన్ని పురస్కరించుకుని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. రంగులు చల్లుకుంటూ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించడంతో ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శి, మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. శ్రీకాంత్ విజయాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వెంకటగిరిలో భారీ ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చి, రంగులు చల్లుకుని టీడీపీ శ్రేణులు సంబరాల్లో తెలిపోయారు. లింగసముద్రం మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేముల గోపాలరావు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేశారు. కలువాయి మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లునాయుడు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సీతారామపురం బస్టాండ్ , ఉదయగిరిలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కందుకూరులో టీడీపీ కార్యాలయంలో స్వీట్లు పంచుకున్నారు. శ్రీకాంత్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

"తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మేల్సీ ఎన్నికలలో నా కుమారుడి విజయంతో నా సుదీర్ఘ కలని నేరవేర్చాడు. కందుకూరును అభివృద్ధికి మారు పేరుగా తయారు చేయాలనేది నా అభిలాష." -కంచర్ల రామయ్య, శ్రీకాంత్ తండ్రి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో తెదేపా శ్రేణుల సంబరాలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.