ETV Bharat / bharat

TDP Chief Nara Chandrababu Naidu Arrest: బాబు అరెస్టులో ఉత్కంఠ పరిణామాలు.. విశ్రాంతి లేకుండా తిప్పిన సీఐడీ - ఉత్కంఠ పరిణామాల మధ్య బాబు అరెస్టు

TDP Chief Nara Chandrababu Naidu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు మొదలుకుని.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించేంత వరకు అత్యంత ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 73ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయనకు సీఐడీ అధికారులు విశ్రాంతి లేకుండా చేశారు. జైలుకు తరలించే క్రమంలోనూ రెండున్నర గంటల ప్రయాణాన్ని నాలుగున్నర గంటల పాటు సాగతీశారు. దాదాపు 48గంటల నుంచి నిద్రలేకుండా ఉన్న చంద్రబాబు పట్ల పోలీసులు పాశవికంగా వ్యవహరించారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

TDP_Chief_Nara_Chandrababu_Naidu_Arrest
TDP_Chief_Nara_Chandrababu_Naidu_Arrest
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 7:34 AM IST

Updated : Sep 11, 2023, 9:05 AM IST

TDP Chief Nara Chandrababu Naidu Arrest: బాబు అరెస్టు మొదలు జైలుకు తరలించేంత వరకు ఉత్కంఠ పరిణామాలు.. ఇబ్బంది పెట్టాలనే విశ్రాంతి లేకుండా చేసిన సీఐడీ

TDP Chief Nara Chandrababu Naidu Arrest: నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రదేశానికి శుక్రవారం అర్ధరాత్రి దాటాక దండయాత్రగా వెళ్లిన పోలీసులు.. శనివారం ఉదయం ఆరు గంటలకు ఆయన్ను అరెస్టు చేశారు. అప్పటినుంచి 24 గంటల్లోగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచవచ్చనే నిబంధనను అడ్డుపెట్టుకుని.. ఆ గడువు రెండు, మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా.. చివరి క్షణంలో చంద్రబాబును విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకొచ్చారు.

Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case: జగన్​ తమ్ముడికి ఒక రూల్​.. ప్రతిపక్ష నాయకుడికి ఒక రూలా!

CID Arrested CBN: విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉత్కంఠభరిత వాతావరణమే కనిపించింది. కొద్దిసేపు భోజన విరామం మినహా రోజంతా వాడీవేడిగా ఇరుపక్షాల మధ్య వాదనలు కొనసాగాయి. రిమాండ్ విధింపుతో రాత్రి 9గంటల 30 నిమిషాల సమయంలో విజయవాడలోని ఏసీబీ కోర్టు ప్రాంగణం నుంచి చంద్రబాబు కాన్వాయ్‌ రాజమహేంద్రవరానికి బయల్దేరింది. చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. దాదాపు 45 గంటలకుపైగా ఆయనకు తగిన నిద్ర, విశ్రాంతి లేకుండా చేసి అటూ ఇటూ తిప్పారు.

Public Protest Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్​పై ప్రజాగ్రహం.. నిరసనల వెల్లువ.. 'టీడీపీ నేతల హౌస్ అరెస్ట్'

CID Arrested CBN in Skill Development Case: శనివారం ఉదయం నంద్యాలలో బయల్దేరి సాయంత్రం ఐదింటికి రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ విచారణ పేరిట కొన్ని గంటల పాటు ప్రశ్నలు సంధిస్తూ చంద్రబాబుకు విశ్రాంతి లేకుండా చేశారు. శనివారం రాత్రి ఏ క్షణమైనా సరే ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారని అందరూ భావించినప్పటికీ, ఆదివారం వేకువజాము వరకూ సిట్‌ కార్యాలయంలోనే ఉంచారు.

Arguments in ACB Court: లాయర్​ అవతారమెత్తిన చంద్రబాబు.. తన కేసును తానే వాదించుకున్న టీడీపీ అధినేత

CBN Arrest: చంద్రబాబును తీసుకుని వేకువజామున 3 గంటల సమయంలో సిట్‌ కార్యాలయం నుంచి బయల్దేరారు. అప్పటికే దాదాపు 21 గంటలపాటు తగిన నిద్ర, విశ్రాంతి లేకుండా ఉన్న చంద్రబాబు నీరసంగా, తీవ్ర అలసటతో కనిపించారు. కుంచనపల్లి సిట్‌ కార్యాలయం నుంచి చంద్రబాబును కోర్టుకు తీసుకొస్తున్నారనే ప్రచారం జరగ్గా.. అనూహ్యంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.

TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

Chandrababu Naidu Arrest: ఆసుపత్రి నుంచి కోర్టుకు తీసుకెళ్తారని అనుకున్న తరుణంలో మళ్లీ అక్కడినుంచి కుంచనపల్లిలోని సిట్‌ కార్యాలయానికి తెల్లవారుజామున ఐదింటికి తరలించారు. అక్కడ కొంతసేపు ఉంచాక అప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టుకు బయల్దేరి 5 గంటల 58 నిమిషాలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 73ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే ఆయన్ను రాత్రంతా అటుఇటూ తిప్పారని టీడీపీ ఆరోపించింది.

CPI Ramakrishna on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. రేపు విజయవాడలో అన్ని పక్షాలతో సమావేశం: రామకృష్ణ

AP CID Arrested Nara Chandrababu Naidu: విజయవాడలోని న్యాయస్థానానికి చేరుకున్నాక కూడా విశ్రాంతి లేకుండా రోజంతా చంద్రబాబు అలా కూర్చునే ఉన్నారు. ఈ సందర్భంగా కంభంపాటి రామ్మోహన్‌రావు, కేశినేని నాని, కాలవ శ్రీనివాసులు, ఇతర టీడీపీ నాయకులు చంద్రబాబును కలిసి మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు చంద్రబాబును తీసుకొస్తారనే సమాచారంతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌లు అక్కడికి చేరుకున్నారు.

Kanna Comments on Chandrababu Arrest: అక్రమ కేసులు పెట్టడంలో వైసీపీ ప్రభుత్వం గిన్నీస్‌ బుక్‌ రికార్డ్‌: కన్నా

Chandrababu Arrest in Nandyal: వారితోపాటు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, న్యాయవాదుల బృందమూ అక్కడికి వచ్చారు. అది మొదలు రోజంతా లోకేశ్‌ కోర్టులోనే ఉన్నారు. న్యాయవాదుల బృందంతో మాట్లాడుతూ కనిపించారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

Amaravati Capital Farmers Agitation On Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు

Last Updated : Sep 11, 2023, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.