ETV Bharat / bharat

Live Updates: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా..

CBN_and_lokesh_Cases_in_Courts Live_Updates

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 10:34 AM IST

Updated : Oct 10, 2023, 2:26 PM IST

14:10 October 10

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా
  • శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ
  • సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌
  • తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన హరీష్‌ సాల్వే
  • సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గీ

14:00 October 10

ఇవాళ సెలవులో ఉన్న ఏసీబీ కోర్టు జడ్జి

  • విజయవాడ: ఇవాళ సెలవులో ఉన్న ఏసీబీ కోర్టు జడ్జి
  • చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్ పిటిషన్లపై రేపు విచారణ జరిగే అవకాశం

13:59 October 10

రింగ్‌ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్

  • రింగ్‌ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్
  • లంచ్ మోషన్ పిటిషన్‌ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
  • లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై రేపు వాదనలు వింటామన్న హైకోర్టు

13:09 October 10

భోజన విరామం తర్వాత కొనసాగనున్న వాదనలు

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణకు విరామం
  • భోజన విరామం తర్వాత కొనసాగనున్న వాదనలు
  • మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ

13:03 October 10

ఎఫ్‌ఐఆర్‌ విషయంలో నేరం జరిగిన సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే మేము చెబుతున్నాం: రోహత్గీ

  • ఎఫ్‌ఐఆర్‌ విషయంలో నేరం జరిగిన సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే మేము చెబుతున్నాం: రోహత్గీ
  • సెక్షన్‌ 13(1)(సి), సెక్షన్‌ 13(1)(డి) 2018 చట్టసవరణ తర్వాత నేరాలే కావు: జస్టిస్‌ త్రివేది
  • ఇప్పటికే జరిగిన నేరంలో పాత చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ చేయవచ్చు: రోహత్గీ
  • నేరం జరిగి ఉన్నప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఏ చట్టం నిరోధించలేదు: రోహత్గీ
  • అనంతర క్రమంలో ఆ సెక్షన్‌ తొలగించినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవచ్చు: రోహత్గీ
  • ఎఫ్‌ఐఆర్‌ ఎలా చేయవచ్చో.. దాన్ని బలపరిచేదేమైనా మీ వద్ద ఉందా?: జస్టిస్‌ త్రివేది
  • ఈ సందర్భంగా శంభునాథ్‌ కేసును ఉదహరించిన ముకుల్‌ రోహత్గీ

12:27 October 10

నేరం ఎప్పుడు జరిగిందో.. అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలి: రోహత్గీ

  • నేరం ఎప్పుడు జరిగిందో.. అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలి: రోహత్గీ
  • పరిణామ క్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింపచేయకూడదు: రోహత్గీ
  • చట్టసవరణలతో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాదు.. ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలి: రోహత్గీ
  • 17ఏ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేయవచ్చన్న ముకుల్‌ రోహత్గీ
  • 17ఏ ప్రకారం ఎంక్వయిరీ, ఇంక్వయిరీ, ఇన్వెస్టిగేషన్‌ దేనికీ అవకాశం లేదన్న బెంచ్‌
  • పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌తో నిర్ణయాలు తీసుకుని వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే దానికి 17ఏ ఎలా వర్తిస్తుంది: రోహత్గీ
  • 17ఏ అన్నది అవినీతిని నిరోధించడం కోసమే పార్లమెంటు దాన్ని తీసుకొచ్చింది: రోహత్గీ
  • భారీఎత్తున అవినీతి జరిగినప్పుడు అందులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కేవలం అధికార విధుల నిర్వహణగా పరిగణించలేము: రోహత్గీ
  • 17ఏ చట్టసవరణ అనేది నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదు: రోహత్గీ
  • నిజాయతీపరులైన అధికారులు, ప్రజాప్రతినిధులను అనవసర భయాల నుంచి దూరం చేయడం కోసమే ఈ సవరణ చేశారు: రోహత్గీ
  • నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టమే అమలులోకి వస్తుందంటూ గతంలో ఇచ్చిన తీర్పును ఉదహరించిన రోహత్గీ
  • ఒకవేళ నేరం 2012, 2013లో జరిగినా 17ఏను రక్షణగా వాడుకుంటారా?: రోహత్గీ
  • 17ఏ చట్టసవరణ పూర్వ నేరాలకు వర్తిస్తుందా? లేదా?: జస్టిస్‌ బోస్‌
  • గతంలో జరిగిన నేరాలు 17ఏ పరిధిలోకి రావు: ముకుల్‌ రోహత్గీ
  • చంద్రబాబు కేసులో ఉన్న అంశాలను క్వాష్‌ పిటిషన్‌ ద్వారా నిర్ణయించలేము: రోహత్గీ
  • అధికారిక బాధ్యతేంటి.. సిఫారసులేంటి.. నిర్ణయాలేంటి.. వీటన్నింటిని సాక్ష్యాల ఆధారంగా పరిశీలించేవి.. మాటల్లో చెప్పలేము: రోహత్గీ
  • కొత్త చట్టం ప్రకారం నేరం కాని విషయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవచ్చా?: జస్టిస్‌ త్రివేది

12:02 October 10

2018 మేలో మెమో దాఖలు చేశారు.. దాంట్లో తగిన వివరాలు ఉన్నాయి: రోహత్గీ

  • 2018కి ముందు కొనసాగిన విచారణ కొంతవరకు సాగి నిలిచిపోయింది.. అంతమాత్రాన విచారణ జరగలేదని కాదు: రోహత్గీ
  • 2018 మేలో మెమో దాఖలు చేశారు.. దాంట్లో తగిన వివరాలు ఉన్నాయి: రోహత్గీ
  • మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్‌ ముందు ఉంచుతున్నాం: రోహత్గీ
  • విచారణ ముగిశాక కాగితాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు: రోహత్గీ
  • వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్‌ ముందు ఉంచారు: రోహత్గీ
  • మేము కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచాం: రోహత్గీ
  • 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు: రోహత్గీ
  • చంద్రబాబుపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు: రోహత్గీ
  • కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ కేసు విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి: రోహత్గీ
  • చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుంది: రోహత్గీ
  • చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఏ వర్తించదు: ముకుల్‌ రోహత్గీ
  • 17ఏ అన్నది నేరం కేంద్రంగా జరుగుతుందా?.. వ్యక్తి కేంద్రంగా జరుగుతుందా అని ప్రశ్నించిన జస్టిస్‌ త్రివేది
  • అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ రెండూ కలగలసిన కేసును సెక్షన్‌4(3) ప్రకారం ప్రత్యేక జడ్జికి న్యాయపరిధి ఉంటుంది: రోహత్గీ
  • అవినీతి నిరోధక చట్టం అమలు కానప్పుడు మిగిలినవేవీ పరిగణనలోకి తీసుకోవద్దని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు: జస్టిస్‌ త్రివేది
  • అవినీతి నిరోధక చట్టమే వర్తించనప్పుడు అసలు కేసు మూలాల నుంచి కొట్టేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు: జస్టిస్‌ త్రివేది

11:36 October 10

2011 దేవిందర్‌ పాల్‌సింగ్‌ బుల్లర్‌ కేసును ప్రస్తావించిన హరీష్‌ సాల్వే

  • 2011 దేవిందర్‌ పాల్‌సింగ్‌ బుల్లర్‌ కేసును ప్రస్తావించిన హరీష్‌ సాల్వే
  • కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాత పరిణామాలేవీ చట్టబద్ధం కావని బుల్లర్‌ కేసులో తీర్పు ఉంది: సాల్వే
  • ప్రారంభం చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుంది: సాల్వే
  • ఈ కేసు మూలంలోనే దోషం ఉంది కాబట్టి.. బుల్లర్‌ కేసును పరిగణనలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నా: సాల్వే
  • నేను ఈరోజు చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌నే సవాల్‌ చేస్తున్నా: హరీష్‌ సాల్వే
  • అన్నీ కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారు.. దాన్నే నేను సవాల్‌ చేస్తున్నా: హరీష్‌ సాల్వే
  • ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధం కాదు: హరీష్‌ సాల్వే
  • ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు ఎక్కడా లేదు: హరీష్‌ సాల్వే
  • డిజైన్‌ టెక్‌కు లబ్ధి చేకూర్చడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం: సాల్వే

11:22 October 10

చట్టం, సవరణలను అన్వయించడానికి అనేక ఉదాహరణలను బెంచ్‌ ముందు ఉంచిన సాల్వే

  • చట్టం, సవరణలను అన్వయించడానికి అనేక ఉదాహరణలను బెంచ్‌ ముందు ఉంచిన సాల్వే
  • రఫేల్‌ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి.. 2019లో యశ్వంత్‌ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి: సాల్వే
  • చట్టసవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు: సాల్వే
  • 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు ఇన్వేస్టిగేషన్‌ జరిపే హక్కు ఉండదు: సాల్వే
  • ఇన్వెస్టిగేషన్‌ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే: హరీష్‌ సాల్వే
  • అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్‌ 17ఏ తో రక్షణ లభించింది: సాల్వే
  • వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను ప్రస్తావించిన హరీష్‌ సాల్వే
  • పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్‌ 20(1)పై వచ్చిన తీర్పును ఉదహరించిన సాల్వే
  • చట్టసవరణ ముందు ఉన్న అంశాలకూ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవచ్చు: సాల్వే
  • సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్న జస్టిస్‌ బోస్‌
  • ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి: సాల్వే
  • కేసులో ప్రజాప్రతినిధి భాగస్వామ్యం ఏంటని విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి: సాల్వే

11:02 October 10

17ఏ చట్టసవరణ ప్రధాన ఉద్దేశం అవినీతిని నిరోధించడం: హరీష్‌ సాల్వే

  • 17ఏ చట్టసవరణ ప్రధాన ఉద్దేశం అవినీతిని నిరోధించడం: హరీష్‌ సాల్వే
  • అవినీతి నిరోధంతో పాటు ప్రజాప్రతినిధులపై ప్రతీకార చర్యలు ఉండకూడదన్నది కూడా ప్రధానమే: హరీష్‌ సాల్వే
  • 17ఏ చట్ట పరిధిలోని అంశాలను కోర్టు ముందు ఉంచిన హరీష్‌ సాల్వే
  • యశ్వంత్‌ సిన్హా కేసులో రఫేల్‌ కొనుగోళ్లు, అనంతరం దాఖలైన కేసులపై వచ్చిన తీర్పులను ఉదహరించిన సాల్వే
  • రఫేల్‌ కేసులో జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ తీర్పును ఉదహరించిన హరీష్‌ సాల్వే
  • రఫేల్‌ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌

10:52 October 10

విచారణ విధానంపై ఇరుపక్షాల భిన్న వాదనలు

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
  • విచారణ విధానంపై ఇరుపక్షాల భిన్న వాదనలు
  • నోటీసులు జారీచేయాలన్న రోహత్గీ వాదనలను తోసిపుచ్చిన సాల్వే
  • సుప్రీంకోర్టు విధివిధానాలను బెంచ్‌ ముందుంచిన ఇరుపక్షాల న్యాయవాదులు
  • మీ వాదనలకు ఎంత సమయం కావాలని సాల్వేను అడిగిన జస్టిస్‌ బోస్‌
  • కనీసం గంట సమయం కావాలని బెంచ్‌ను కోరిన హరీష్‌ సాల్వే
  • గంట సమయం అవసరమైనప్పుడు గంట తర్వాతే వస్తానని బెంచ్‌కు చెప్పిన రోహత్గీ
  • నోటీసులు ఇస్తారా అనే విషయాన్ని బెంచ్‌ తేల్చాలని కోరిన ముకుల్‌ రోహత్గీ
  • కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన హరీష్‌ సాల్వే
  • హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్ల అవసరం ఉండదన్న జస్టిస్‌ త్రివేది
  • క్రిమినల్‌ కేసుల్లో మళ్లీ కౌంటర్‌ అఫిడవిట్ల అవసరమేంటని ప్రశ్నించిన హరీష్‌ సాల్వే
  • నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని.. అలా కాకపోతే మళ్లీ మొదటికొస్తుందన్న రోహత్గీ
  • నోటీసులు అవసరం లేదన్న విధివిధానాలపై మీవద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించిన జస్టిస్‌ త్రివేది
  • గతంలో వచ్చిన తీర్పులను బెంచ్‌ ముందు ఉంచుతానని చెప్పిన హరీష్‌ సాల్వే

10:33 October 10

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో ఐదు నిమిషాల ముందే సీఐడీ విచారణకు లోకేష్‌

  • అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో సీఐడీ విచారణకు లోకేష్‌
  • ఐదు నిమిషాలు ముందే సీఐడీ కార్యాలయానికి నారా లోకేష్
  • తాడేపల్లి సమీపంలోని సిట్ కార్యాలయంలో విచారణ
  • అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌లో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నోటీసులు
  • నోటీసుల్లోని పలు అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును ఆశ్రయించిన లోకేష్
  • సీఐడీకి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన హైకోర్టు
  • విచారణ సమయంలో లోకేష్‌తోపాటు న్యాయవాదిని అనుమతించాలని ఆదేశం
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు విచారించాలని స్పష్టంచేసిన న్యాయస్థానం
  • మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని సీఐడీకి కోర్టు ఆదేశం

09:36 October 10

చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై నేడు విచారణ

  • చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై నేడు విచారణ
  • మధ్యాహ్నం 2.30 తర్వాత విచారించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు
  • అమరావతి రింగ్‌రోడ్‌, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై విచారణ
  • చంద్రబాబుకు 2 కేసుల్లో రిమాండ్ విధించాలని కోరిన సీఐడీ అధికారులు

09:34 October 10

తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో లోకేశ్ విచారణ

  • కోర్టు ఉత్తర్వుల మేరకు నేడు సీఐడీ విచారణకు నారా లోకేశ్
  • అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నోటీసులు
  • తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ
  • సీఐడీ నోటీసుల్లోని పలు అంశాలపై ఈనెల 4న కోర్టును ఆశ్రయించిన లోకేశ్

  • విచారణ సమయంలో లోకేశ్​తోపాటు న్యాయవాదిని అనుమతించాలని ఆదేశం
  • ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దన్న న్యాయస్థానం
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు విచారించాలని స్పష్టంచేసిన న్యాయస్థానం

09:32 October 10

నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్న నారా లోకేశ్

  • నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్న నారా లోకేశ్
  • విజయవాడ సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న లోకేశ్
  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో విచారణకు హాజరుకానున్న లోకేశ్
  • విచారణకు రావాలని నారా లోకేష్‌కు గతంలోనే నోటీసులు ఇచ్చిన సీఐడీ
  • విచారణకు హాజరయ్యేందుకు దిల్లీ నుంచి విజయవాడ వచ్చిన లోకేశ్

09:32 October 10

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

09:23 October 10

Live Updates: చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై నేడు విచారణ

  • Live Updates: చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై నేడు విచారణ
  • చంద్రబాబుపై దాఖలు చేసిన పీటీ వారెంట్లపై విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు
  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్‌

Last Updated : Oct 10, 2023, 2:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.