ETV Bharat / bharat

బలహీనపడిన తౌక్టే- గుజరాత్​లో 13 మంది మృతి - తౌక్టే న్యూస్

గుజరాత్​ తీరంలో మంగళవారం తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సానికి 13 మంది మృతిచెందారు. ప్రస్తుతం తుపాను క్రమంగా బలహీన పడుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న ఆరు గంటల్లో మరింత బలహీన పడనుందని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం గుజరాత్‌కు వెళ్లి తుపాను తీవ్రతను స్వయంగా పరిశీలించనున్నారు.

tauktae
తౌక్టే, తుపాను ప్రభావం
author img

By

Published : May 19, 2021, 6:18 AM IST

అరేబియా సముద్రంలో బీభత్సం సృష్టించిన 'తౌక్టే' అతి తీవ్ర తుపాను సోమవారం అర్ధరాత్రి గుజరాత్‌- దీవ్‌ మధ్య తీరాన్ని దాటినా రెండు రాష్ట్రాల్లో అనేక వెతలు మిగిల్చింది. గుజరాత్‌లో 13 మంది మృత్యువాత పడ్డారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చమురు క్షేత్రాల్లో, చమురు వెలికితీత నౌకల్లో పనిచేసే వందల మంది సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. వారికి ప్రాణాపాయం లేకుండా చూడడానికి నౌకాదళం, భారత తీర గస్తీ దళం రంగంలో దిగాయి.

చమురు బావుల్లో, నౌకల్లో కలిపి 707మంది నడిసంద్రంలో చిక్కుకుపోగా వారిలో 317 మందిని మంగళవారం సాయంత్రం వరకు రక్షించగలిగారు. మిగిలినవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ బుధవారం గుజరాత్‌కు వెళ్లి తుపాను తీవ్రతను స్వయంగా పరిశీలించనున్నారు. దిల్లీ నుంచి నేరుగా గాంధీనగర్‌కు ఆయన చేరుకుని అక్కడి నుంచి ఏరియల్‌ సర్వేలో పాల్గొంటారు.

mumbai
చెట్టు విరిగి ధ్వంసమైన కార్లు

గజ గజరాత్‌

తౌక్టే అతి తీవ్ర తుపాను గుజరాత్‌కు తీవ్ర నష్టం కలిగించింది. కుండపోత వర్షాలు, పెను గాలుల కారణంగా రాష్ట్ర తీరప్రాంతం చిగురుటాకులా వణికింది. అనేకచోట్ల 9 అంగుళాలకు పైగా వాన కురిసింది. కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 40వేల వృక్షాలు, 60 వేల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయని ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ చెప్పారు. సుమారు 16వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, అనేకచోట్ల రహదారులు తెగిపోయాయని తెలిపారు. దాదాపు 2500 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని, రాష్ట్రంలో 1400 ఆసుపత్రుల్లో ఉన్న కొవిడ్‌ బాధితులకు చికిత్సలో ఎలాంటి అంతరాయం వాటిల్లకుండా చూడడం తమ ముందున్న సవాల్‌ అని చెప్పారు.

gujrath
గుజరాత్​లో ఎగిరిపోయిన పెట్రోల్​ బంకు పైకప్పు

దీవ్‌- ఉనా మధ్య సోమవారం అర్ధరాత్రి 1.30 గంటలకు తుపాను తీరాన్ని దాటిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. 'అత్యంత తీవ్ర తుపాను'గా తీరాన్ని దాటి ఆ తర్వాత బలహీనపడడం మొదలైందని తెలిపింది. రానున్న ఆరు గంటల్లో తుపాను మరింత బలహీన పడనుందని స్పష్టం చేసింది. మంగళవారం కూడా పలుచోట్ల విస్తారంగా వానలు కురిశాయి. దాదాపు 2 లక్షల మంది ప్రజలు పునరావాస శిబిరాల్లో తల దాచుకున్నారు. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వెరావల్‌ తీరం వద్ద ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని తీరగస్తీ దళం రక్షించింది. మొరాయించిన నౌకలో ఉన్న మరో ఎనిమిది మందిని చేతక్‌ హెలికాప్టర్లలో రక్షించి తీసుకువచ్చారు. వెన్‌గుర్ల రాక్‌ లైట్‌హౌస్‌లో చిక్కుకున్న ఉద్యోగులను రక్షించడానికి కూడా హెలికాప్టర్లను రంగంలో దించాల్సి వచ్చింది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సాహసోపేతంగా వ్యవహరించి వారిని రక్షించగలిగారు. పెనుతుపాను విరుచుకుపడినా పెద్ద నష్టం లేకుండా బయటపడగలిగామని ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ పేర్కొన్నారు.

మహారాష్ట్రలో 11 మంది మృతి

తౌక్టే తుపాను మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. 12వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేకచోట్ల విద్యుత్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో 30 గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ముంబయిలో ఏ ఏడాది మే నెలలోనూ లేని రీతిలో 24 గంటల వ్యవధిలో 230.3 మి.మీ. కుండపోత వర్షం కురిసింది. ముంబయి తీరంలో అరేబియా సముద్రంలో కొట్టుకుపోతున్న రెండు చమురు రవాణా ట్యాంకర్లను తీర గస్తీ దళం (ఐసీజీ) రక్షించింది. 45 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, చమురు లీకేజి ముప్పును అరికట్టగలిగామని ఐసీజీ ప్రకటించింది.

maharashtra
మహారాష్ట్రలో దెబ్బతిన్న అరటి తోట

ఓఎన్జీసీ చమురు బావుల వద్ద ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ ముంబయి తీరంలో పెనుతుపానులో చిక్కుకుపోయిన దాదాపు 600 మందిని రక్షించడానికి నౌకాదళం రంగంలో దిగింది. ఆఫ్‌షోర్‌ ఉద్యోగులకు నివాసంగా ఉపయోగపడుతున్న నౌక (బార్జి) మునిగిపోగా లంగరు తెగిపోవడంతో మరో రెండు బార్జిలు కొట్టుకుపోయాయి. ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ రిగ్‌ 'సాగర్‌ భూషణ్‌' కూడా కొట్టుకుపోయింది. దానిపై 64 మంది ఒప్పంద ఉద్యోగులు సహా 101 మంది ఉన్నారు. పపా-305 అనే మరో బార్జిపై 261 మంది ఉండగా వారిలో 182 మందిని రక్షించారు. మిగిలినవారిని గుర్తించి, రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పన్నాలో తప్పిస్తే మిగిలిన చోట్ల చమురు ఉత్పత్తి యథావిధిగా జరుగుతున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది. ముంబయిలో 'గేట్‌ వే ఆఫ్‌ ఇండియా' వద్ద సముద్ర తీరానికి అభిముఖంగా ఉన్న రక్షణ గోడ, ఇనుప గేట్లు వంటివి కెరటాల తాకిడికి దెబ్బతిన్నాయి. జెట్టీలోని రాళ్లు ఊడి, ఐదు మీటర్ల దూరంలో పడ్డాయి. ప్రధాన కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

thiruvananthapuram road
కోతకు గురైన తిరువనంతపురం రోడ్డు

ఇదీ చదవండి:తౌక్టే ఎఫెక్ట్​: పశ్చిమ తీరానికి భారీ నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.