రానున్న 24గంటల్లో తౌక్టే తుపాన్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 18న గుజరాత్లోని పోర్బందర్, మహూవా తీరాన్ని దాటనున్నట్లు తెలిపింది.
మే 17, 18న గుజరాత్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గాలులు గంటకు 115-165కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని, మే18 వరకు చేపల వేటకు అరేబియా సముద్రం మీదికి వెళ్లొద్దని మత్య్సకారులను హెచ్చరించింది.
పుణె..
తౌక్టే వల్ల వీచిన ఈదురు గాలులకు పుణెలోని భోర్గిరి, భీవేగావ్ గ్రామాల్లోని అంగన్ వాడీ, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయతీ భవనాల పైకప్పులు కూలిపోయాయి.
కేరళ..
తౌక్టే వల్ల కురిసిన కుండపోత వర్షానికి అలప్పుజలో ఇళ్లు, రోడ్లు జలదిగ్బంధం అయ్యాయి.
తిరువనంతపురంలోని పరిస్థితి..
గోవా..
తౌక్టే ధాటికి పనాజీలో చెట్లు విరిగి రోడ్లమీద పడ్డాయి.
కర్ణాటకలో...