ETV Bharat / bharat

'తౌక్టే' తీవ్ర రూపం- అమిత్ షా సమీక్ష

తుపాను తౌక్టే.. మరో 24 గంటల్లో మరింత తీవ్రరూపు దాల్చనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్, దమణ్​ దీవ్​​లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితులపై సమీక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

CYCLONE Tauktae UPDATE
మరింత తీవ్రంగా తౌక్టే- అమిత్ షా సమీక్ష
author img

By

Published : May 16, 2021, 1:35 PM IST

తౌక్టే తుపాను వచ్చే 24 గంటల్లో మరింత ప్రమాదకరంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం సాయంత్రానికల్లా గుజరాత్ తీరాన్ని చేరుకుంటుందని వెల్లడించింది. పోర్​బందర్, మహువా(భావ్​నగర్ జిల్లా) వద్ద గుజరాత్ తీరం దాటుతుందని ఐఎండీ పేర్కొంది. ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 175 కిమీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ సహా దమణ్​ దీవ్​​లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

CYCLONE Tauktae UPDATE
తుపాను గమనం ఇలా...

ప్రస్తుతం ఎక్కడ?

గోవాలోని పంజింకు దక్షిణ నైరుతి దిక్కున 130 కిమీ, ముంబయి దక్షిణాన 450 కిమీ, వెరావల్(గుజరాత్)కు దక్షిణ ఆగ్నేయాన 700 కిమీ, కరాచీ(పాకిస్థాన్)కి ఆగ్నేయాన 840 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో జునాగఢ్​లో మూడు మీటర్ల ఎత్తైన అలలు ఏర్పడతాయని తెలిపింది. దమణ్​ దీవ్​, గిర్, సోమ్​నాథ్, అమ్రేలీ, భరూచ్, భావ్​నగర్, అహ్మదాబాద్, ఆనంద్, సూరత్​లలో 2.5 మీటర్ల ఎత్తులో అలలు సంభవిస్తాయని పేర్కొంది.

CYCLONE Tauktae UPDATE
కర్ణాటకలో వర్షం
CYCLONE Tauktae UPDATE
కర్ణాటక: విరిగిపడ్డ చెట్లను తొలగిస్తున్న సిబ్బంది
CYCLONE Tauktae UPDATE
కర్ణాటక.. గాలికి పడిపోయిన రేకులు

షా సమీక్ష

తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, మహారాష్ట్ర సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. దమణ్​ దీవ్​, దాద్రానగర్ హవేలీ అధికారులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు.

CYCLONE Tauktae UPDATE
అమిత్ షా సమీక్ష సమావేశం

యడియూరప్ప ఆదేశాలు

తుపాను కర్ణాటక తీరం తాకిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప పరిస్థితులను సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని ఇంఛార్జి మంత్రులను ఆదేశించారు. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారని స్పష్టం చేశారు. అత్యవసరమైతే మంత్రులకు నేరుగా ఫోన్ చేయాలని అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో నలుగురు చనిపోయారు.

CYCLONE Tauktae UPDATE
కర్ణాటక: వంతెన స్థాయిలో ప్రవహిస్తున్న కాలువ
CYCLONE Tauktae UPDATE
కర్ణాటక: దెబ్బతిన్న రహదారులు
CYCLONE Tauktae UPDATE
కర్ణాటకలో విరిగిపడ్డ చెట్ల కొమ్మలు

ఆగిన విద్యుత్

మరోవైపు, తౌక్టే కారణంగా గోవాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులపై చెట్లు పడిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి: అతి తీవ్ర తుపానుగా 'తౌక్టే'- ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.