ETV Bharat / bharat

ముఖ్యమంత్రికి చల్లారిన టీ... అధికారికి షోకాజ్ నోటీసు! - madhya pradesh cm latest news

ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన టీ చల్లారిపోయిందని, బాగాలేదని ఓ అధికారికి షోకాజ్​ నోటీసులు ఇవ్వడం మధ్యప్రదేశ్​లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం సోషల్​ మీడియా వైరల్​ కాగా.. ఆ నోటీసుల్ని ఉన్నతాధికారులు ఉపసంహరించకున్నారు.

cold tea to cm shivraj
ముఖ్యమంత్రికి చల్లారిన టీ... అధికారికి షోకాజ్ నోటీసు!
author img

By

Published : Jul 12, 2022, 7:27 PM IST

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కోసం సిద్ధం చేసిన టీ సరిగా లేదంటూ ఓ అధికారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సదరు ఉద్యోగిని ఆదేశించిన ఉన్నతాధికారులు.. నెట్టింట వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. ఆ నోటీసుల్ని ఉపసంహరించుకున్నారు.

సీఎం తాగకపోయినా...
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ సోమవారం భోపాల్​ నుంచి​ రేవా వెళ్లారు. మధ్యలో ఛతర్​పుర్​ జిల్లా ఖజురహో విమానాశ్రయంలో ఆగారు. సీఎం రాక సందర్భంగా టీ, అల్పాహారం, ఇతర ఏర్పాట్లన్నీ చేసే బాధ్యతను జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కన్హువాకు అప్పగించారు ఉన్నతాధికారులు.

అయితే.. ఖజురహో ఎయిర్​పోర్ట్​లో సీఎం కోసం సిద్ధం చేసిన టీ చల్లగా ఉందని, ఏమాత్రం బాగా లేదంటూ రాకేశ్​కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు రాజ్​నగర్​ సబ్​ డివిజనల్ మేజిస్ట్రేట్ డీపీ ద్వివేది. ఈ వ్యవహార శైలి.. జిల్లా అధికార యంత్రాంగాన్ని అభాసుపాలు చేసేలా, వీవీఐపీల నిబంధనావళి అమలుపై ప్రశ్నలు లేవనెత్తేలా ఉందని మండిపడ్డారు. ఇలా ఎందుకు జరిగిందో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాకేశ్​ను ఆదేశించారు ద్వివేది.

cold tea to cm shivraj
రాకేశ్​కు జారీ చేసిన షోకాజ్ నోటీసు

సీఎం టీ చల్లారిపోయిందని షోకాజ్ నోటీసులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఆ చాయ్​ను శివరాజ్​ సింగ్​ తాగలేదని, ఆయన ఎయిర్​పోర్ట్ టెర్మినల్​లోకి రాకుండానే రన్​వే పై మరో విమానం ఎక్కి వెళ్లిపోయారన్న వార్త వెలుగులోకి వచ్చింది. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం.. షోకాజ్​ నోటీసులు ఉపసంహరించుకుంది.
ఈ వ్యవహారంలో అధికార పక్షంపై కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది. "ప్రజలకు రేషన్​ అందకపోయినా, సకాలంలో అంబులెన్స్ రాకపోయినా ఫర్వాలేదు. కానీ.. ముఖ్యమంత్రికి ఇచ్చే టీ మాత్రం చల్లగా ఉండకూడదా?" అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా.

cold tea to cm shivraj
విమానాశ్రయంలో ముఖ్యమంత్రి శివరాజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.