ETV Bharat / bharat

'స్వదేశీ టీకాలపై విమర్శలు విదేశీయులకు సాయమే' - BJP allegation on oppositions latest news

కరోనా టీకాలకు డీసీజీఐ ఆమోదం తెలపడంపై విపక్షాలు చేసిన ఆరోపణలను భాజపా ఖండించింది. స్వదేశీ టీకాలపై విమర్శలతో ప్రతిపక్షాలు.. విదేశాలకు సాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా. టీకాల రాకతో దేశ ప్రజలు సంతోషంగా ఉంటే.. వారిని అయోమయానికి గురి చేసేలా వదంతులు వ్యాపింప చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు.

Targeting Opposition, BJP says political row over indigenous vaccine helping 'foreign forces'
'స్వదేశీ టీకాలపై విమర్శలు- విదేశీయులకు సాయం'
author img

By

Published : Jan 4, 2021, 8:54 PM IST

కొవిడ్ టీకాలకు అత్యవసర అనుమతిపై విపక్షాలు చేసిన విమర్శలను భాజపా తీవ్రంగా ఖండించింది. స్వదేశీ టీకాల ఆమోద ప్రక్రియపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ విదేశీ శక్తులకు సహాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా. భారత్​ స్వయంసమృద్ధి సాధించడం వారికి ఇష్టం లేదని ఆరోపించారు. 'రెండు టీకాలకు ఆమోదంతో దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, సహా ప్రతిపక్ష​ నేతలు​ మాత్రం టీకాలపై వదంతులు వ్యాప్తి చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే ప్రయత్నిస్తున్నారు' అని మండిపడ్డారు.

"వ్యాక్సిన్​లకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే వాటిని తొలగిస్తామని శాస్త్రవేత్తలు, ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కూడా ప్రశంసించింది. అయినా టీకాలను రాజకీయం ప్రతిపక్షాలు చేస్తున్నాయి" అని పాత్రా అన్నారు. దీనంత బాధాకరమైన విషయం మరొకటి లేదన్నారు.

'టీకాలు వారి ఆత్మస్థైర్యానికి ప్రతీక'

"టీకాలతో ఎవరు లాభం పొందుతున్నారు? విదేశీ శక్తులకు ప్రయోజనం చేకూరుతుందా? వీటితో ఎవరికి ప్రమాదం? ఇవి దేశ ప్రజలకు హాని చేస్తాయా? టీకాలు.. శాస్త్రవేత్తల ఆత్మస్థైర్యానికి ప్రతీక. ప్రతిపక్షాలు ఎందుకు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి?" అని ప్రశ్నల వర్షం కురిపించారు సంబిత్​. దేశం సంతోషంగా ఉంటే కాంగ్రెస్​ ఆనందంగా ఉండలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మాట మార్చిన అఖిలేశ్​

కొవిడ్​ టీకాను భాజపా వ్యాక్సిన్​గా అభివర్ణించి, తాను వ్యాక్సిన్​ తీసుకునే ప్రసక్తే లేదన్న సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​​ యాదవ్.. మాట మార్చారు. టీకాలు అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను తాను ఎప్పుడూ అవమానించలేదన్నారు. వారి ప్రస్తావనే తీసుకురాలేదన్నారు.

పేదలకు ఉచితంగా టీకా ఇస్తారా? లేదా? చెప్పమని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పుకొచ్చారు అఖిలేశ్​. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు నమ్మకం లేనందున భాజపాపై మాత్రమే ప్రశ్నలు సంధించానన్నారు.

ఇదీ చూడండి: 'మోదీజీ... నేతాజీ రహస్య పత్రాల సంగతేంటి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.