ETV Bharat / bharat

మరణించిన కొడుకు బతికొస్తాడని 30 గంటలు పూజలు.. ఆ పాము కోసం వేట! - మెయిన్​పురిలో వింత ఘటన

తాంత్రికులతో పూజలు చేయిస్తే మరణించిన కొడుకు బతుకుతాడని ఆశ పడ్డారు తల్లిదండ్రులు. సుమారు 30 గంటలు పాటు పూజలు చేయించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

tantra mantra in mainpuri
మంత్రాలతో యువకుడిని బతికించవచ్చని నమ్మిన తల్లిదండ్రులు
author img

By

Published : Jul 25, 2022, 2:01 PM IST

మరణించిన వ్యక్తి బతికొస్తాడన్న ఆశతో 30 గంటలు పూజలు చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.
అసలేం జరిగిందంటే: మెయిన్​పురి జిల్లాలోని జాటవాన్​ మొహల్లా గ్రామానికి చెందిన తాలీబ్ చేతిపై శుక్రవారం వేకువజామున పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయినా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తాలీబ్ చనిపోయాడని నమ్మలేదు.

తాలీబ్​ను ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో తాంత్రికులను, పాములను పట్టేవారిని తీసుకొచ్చారు అతడి కుటుంబ సభ్యులు. సుమారు 30 గంటలు పాటు తాంత్రికులు పూజలు చేశారు. మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచి డప్పులు వాయిస్తూ భూతవైద్యం చేశారు. తాలీబ్​కు కాటేసిన పామును పట్టుకునేందుకు నలుగురిని రప్పించారు. యువకుడి మృతదేహం వద్ద వేప, అరటి కొమ్మలను పెట్టి పూజలు నిర్వహించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఇలా 30 గంటల పాటు శ్రమించినా తాలీబ్​​లో చలనం లేకపోవడం వల్ల ఆదివారం సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.

తాలీబ్ పంజాబ్​లో పనిచేస్తున్నాడు. పది రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చాడు. కొన్ని రోజులు క్రితమే అతడి మేనల్లుడు పాము కాటుకు బలయ్యాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి: కలియుగ శ్రవణుడు.. అమ్మానాన్నలను భుజాలపై మోస్తూ వందల కి.మీ. యాత్ర

రెండు డబుల్​ డెక్కర్​ బస్సులు ఢీ- 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.