ETV Bharat / bharat

బాలుడికి టీచర్ ప్రేమ పాఠాలు.. పారిపోయి పెళ్లి.. చివరకు జైలుకు...

Tamilnadu teacher student love story: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ప్రేమ పాఠాలు చెప్పింది. మైనర్​ను తీసుకుని పొరుగూరుకు పారిపోయి, పెళ్లి చేసుకుంది. చివరకు అరెస్టయింది.

teacher sharmila in marraiage minor
మైనర్​ను పెళ్లిచేసుకున్న టీచర్ షర్మీల
author img

By

Published : Mar 25, 2022, 4:55 PM IST

Tamilnadu teacher student love story: ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి.. 11వ తరగతి చదువుతున్న బాలుడిని తీసుకుని పారిపోయింది ఓ ఉపాధ్యాయురాలు. ఓ గుడిలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. చివరకు అరెస్టయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

తిరుచిరాపల్లి జిల్లా తురాయూర్​లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి(17).. మార్చి 5న ఆడుకోవడానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై పోలీసులకు అతడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణను పాఠశాలలో ప్రారంభించారు. అదే స్కూల్​లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షర్మిల(26) కూడా కనిపించడం లేదని తెలుసుకున్నారు.

నిత్యం ఫోన్​లో సంభాషణలు.. పోలీసులు షర్మిల ఇంటికి వెళ్లి ఆమె తల్లిని విచారించారు. తన కూతురు ఫోన్​లో ఓ విద్యార్థితో నిత్యం మాట్లాడుతుండేదని ఆమె వెల్లడించింది. పలుమార్లు వద్దని హెచ్చరించినా వినలేదని వివరించింది. షర్మిల ఫోన్​ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. వెళాంకిణి, తిరువారూర్, తంజావూర్, తిరుచిరాపల్లిలో ఆ ఫోన్​ సిగ్నల్స్​ గుర్తించారు.

మార్చి 25వ తేదీన సిగ్నల్ ఆధారంగా చూస్తే షర్మిల ఫోన్ తిరుచిరాపల్లి జిల్లాలోని ఎడమలపట్టి పుత్తూర్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హుటాహుటిన అక్కడకు వెళ్లారు. విద్యార్థితో కలిసి తన ఫ్రెండ్​ ఇంట్లో ఆమె ఉంటున్నట్లు కనుగొన్నారు. షర్మిలను అదుపులోకి తీసుకుని, ప్రశ్నించారు. తంజావూరులోని ఓ ఆలయంలో మైనర్​ను పెళ్లాడినట్లు ఆమె వెల్లడించింది. బాలుడిని అపహరించి, పెళ్లి చేసుకున్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి, పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్.. మహారాష్ట్రలో మైనర్లపై దారుణం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.