ETV Bharat / bharat

ఆ ప్రభుత్వ స్కూల్లో చేరితే ఫ్రీ నాసా ట్రిప్! - తమిళనాడు మోడల్ పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది తమిళనాడు ప్రభుత్వం. ఉచిత నైపుణ్య శిక్షణ, ఫ్రీ నాసా ట్రిప్ వంటి హామీలతో అడ్మిషన్లు పెరిగేలా చేస్తోంది.

tamilnadu schools
ఆ స్కూల్లో చేరితే పాస్​ గ్యారెంటీ.. ఫ్రీ నాసా ట్రిప్..!
author img

By

Published : Jul 9, 2021, 12:17 PM IST

విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకుమించిన భారంగా మారాయనేది కాదనలేని సత్యం. అత్యధిక ఫీజులు చెల్లించి ఓ మంచి ప్రైవేట్ విద్యాసంస్థలో సీటు సంపాదించడం అంత తేలికేం కాదు. అయితే.. తమిళనాడులో చేపడుతున్న చర్యలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

తాంబూలంతో ఆహ్వానం..

విద్యాశాఖ అధికారులు నేరుగా విద్యార్థుల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ఒప్పిస్తున్నారు. తాంబూలం అందించి ఆహ్వానిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరించే కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. నిరంతర కృషి కారణంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారుతోందని విద్యాశాఖ అధికారి భక్త ప్రియ తెలిపారు.

ప్రత్యేక శిబిరాలు..

విద్యార్థుల చేరికను పెంచేందుకు అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో.. చెన్నై వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. మొత్తం 93,445 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే.. 18,991 మంది కొత్తగా నమోదైనట్లు పేర్కొన్నారు.

కరోనాకు ముందు స్మార్ట్ క్లాస్​రూమ్, ప్లే గ్రౌండ్ సౌకర్యంతో పాటు వినూత్న నైపుణ్యాలు అందించింది విద్యాశాఖ. ఆన్​లైన్ తరగతుల కాలంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సందేహాలను నివృత్తి చేస్తోంది.

నాసా ట్రిప్​..

విద్యార్థుల నమోదును పెంచేందుకు ఓ అడుగు ముందుకేసి హామీ కార్డులను జారీ చేస్తున్నాయి కొన్ని పాఠశాలలు. తిరుచి జిల్లా తురైయూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల అమలు చేసిన ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. ఉచిత విద్యా బోధనతో పాటు.. క్రీడల్లోనూ శిక్షణనిస్తామని ఆ పాఠశాల హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఈ పద్ధతిని అమలు చేస్తున్న మొట్టమొదటి సంస్థ తమదేనని ఈ పాఠశాల ప్రకటించింది. దీనితో చేరికలు 172% పెరిగినట్లు తెలిపింది.

రోటరీ క్లబ్​తో కలసి విద్యార్థులను ఇతర రాష్టాలు, విదేశీ పర్యటనలకూ తీసుకువెళుతోంది. 2018లో ఎనిమిది మంది విద్యార్థులను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ట్రిప్​కు తీసుకెళ్లింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.