ETV Bharat / bharat

మూడడుగుల కొబ్బరిచెట్టు.. విరగ కాసేను చూడు! - మూడడుగుల కొబ్బరిచెట్టు వీడియోలు

కొబ్బరి చెట్లు సాధారణంగా 10 నుంచి 20 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంటాయి. కానీ కేవలం మూడడగుల ఎత్తున్న కొబ్బరి చెట్లను ఎప్పుడైనా చూశారా? అదీ విపరీతంగా కొబ్బరిబోండాలు కాసే ఈ చెట్టు ఎక్కడుందో తెలుసా?

coconuts
మూడడుగుల కొబ్బరిచెట్టు.
author img

By

Published : Aug 8, 2021, 7:03 AM IST

Updated : Aug 8, 2021, 10:14 PM IST

మూడడుగుల కొబ్బరిచెట్టు.. విరగ కాసేను చూడు!

కొబ్బరి చెట్టు ఎంత ఎత్తు ఉంటుంది అని అడిగితే ఓ అంతెత్తు అని టక్కున చెబుతుంటాం. అయితే మూడు అడుగుల కొబ్బరి చెట్లు ఎప్పుడైనా చూశారా? అదీ విపరీతంగా కాయలు కాస్తున్న చెట్టు గురించి తెలుసా? తమిళనాడు మైలాడుతురై జిల్లా మరైయూర్ గ్రామంలో ఉన్న ఓ కొబ్బరి చెట్టు కేవలం మూడడుగులే పెరిగింది. అంతేగాక అనేక కాయలు కాస్తూ అబ్బురపరుస్తోంది.

coconuts
మూడడుగుల కొబ్బరిచెట్టు
coconuts
చేతికి అందే అంత ఎత్తులో కొబ్బరికాయలు
coconuts
మూడడుగుల కొబ్బరిచెట్టుని కొలిచి చూపిస్తున్న శివకుమార్

ఇలా ఎలా..?

గ్రామానికి చెందిన శివకుమార్ అనే రైతు ఇంట్లో 12 ఏళ్ల క్రితం నాటిన ఓ కొబ్బరి చెట్టు 22 అడుగుల పొడవు ఉండేది. డజన్ల కొద్దీ కాయలు కాసే ఈ చెట్టు విత్తనాన్ని 2018లో శివకుమార్ తన పెరట్లో నాటాడు. ఆ మొక్క పెరుగుతున్న క్రమంలో దానిపై పిడుగు పడింది. దీనితో శివకుమార్ కుటుంబమంతా చాలా బాధపడింది.

coconuts
పాత చెట్టు విత్తనాలు
coconuts
భారీ వర్షాలకు కుప్పకూలిన పాత చెట్టు

అయితే అనూహ్యాంగా 2019లో దానికదే మళ్లీ చిగురించింది. కానీ కేవలం మూడు అడుగులు మాత్రమే పెరిగింది. అయినప్పటికీ విరివిగా కొబ్బరికాయలు కాస్తోంది. దీనితో శివకుమార్ కుటుంబంతో పాటు గ్రామస్థులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఈ చెట్టు కాయలను ఆలయంలో జరిగే అభిషేకానికి పంపుతున్నట్లు శివకుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 8, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.