Tamilnadu News: ఉగాది పండగ వేళ తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపత్తూరు వద్ద ఓ ట్రక్కు 100 అడుగుల లోయలో పడిన ప్రమాదంలో 11 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. పులియూరు గ్రామానికి చెందిన వీరంతా తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై ఆలయ దర్శనానికి బయలుదేరి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారి కుటుంబాలకు 50వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇదీ చదవండి: చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకలు