తమిళనాడు తంజావూరులో మరో పరువు హత్య వెలుగుచూసింది. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో కుమార్తె తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఇదీ జరిగింది..
కుంభకోణం సమీపంలోని వేటమంగళం పండనల్లూరికి చెందిన ప్రభాకరన్ (22) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామంలో మణికందన్ అనే వ్యక్తి కుమార్తెతో ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడం వల్ల మణికందన్ కుటుంబం వీరి ప్రేమను వ్యతిరేకించింది.
ఈ క్రమంలో అక్టోబర్ 10న కామాచిపురం ఏరియా మార్కెట్‌లో ఉన్న ప్రభాకరన్‌తో మణికందన్ గొడవపెట్టుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రభాకరన్‌ను పొడిచాడు. పక్కనే ఉన్న అతని సోదరుడు విఘ్నేశ్‌ను సైతం గాయపపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకరన్‌ను కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రభాకరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. మణికందన్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: