Tamilnadu Bus Accident : ఊటీ విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని కూనూర్ సమీపంలోని మరపాలం వద్ద జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు సహా ఓ మైనర్ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
-
VIDEO | Eight people dead, more than thirty injured after a tourist bus fell into a gorge in Coonoor area of Tamil Nadu's Nilgiris district.
— Press Trust of India (@PTI_News) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
CM Stalin has announced an ex-gratia amount of Rs 8 lakh each for the kin of dead and Rs 1 lakh each for seriously injured while Rs 50,000… pic.twitter.com/GtKlRiZimg
">VIDEO | Eight people dead, more than thirty injured after a tourist bus fell into a gorge in Coonoor area of Tamil Nadu's Nilgiris district.
— Press Trust of India (@PTI_News) September 30, 2023
CM Stalin has announced an ex-gratia amount of Rs 8 lakh each for the kin of dead and Rs 1 lakh each for seriously injured while Rs 50,000… pic.twitter.com/GtKlRiZimgVIDEO | Eight people dead, more than thirty injured after a tourist bus fell into a gorge in Coonoor area of Tamil Nadu's Nilgiris district.
— Press Trust of India (@PTI_News) September 30, 2023
CM Stalin has announced an ex-gratia amount of Rs 8 lakh each for the kin of dead and Rs 1 lakh each for seriously injured while Rs 50,000… pic.twitter.com/GtKlRiZimg
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తెంకాసి జిల్లా కడయం ప్రాంతానికి చెందిన పర్యటకులు ఊటీ విహారయాత్రకు వెళ్లారు. పర్యటన ముగించుకుని శనివారం (సెప్టెంబర్ 30) తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో బస్సు కూనూర్‌లోని మలపాలం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఓ మైనర్ సహా 9 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. PMNRF నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పును ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తామన్నారు.
-
Pained by the loss of lives due to a bus accident near Coonoor in Nilgiris district, Tamil Nadu. My thoughts are with the bereaved families. I pray that the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Those…
— PMO India (@PMOIndia) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pained by the loss of lives due to a bus accident near Coonoor in Nilgiris district, Tamil Nadu. My thoughts are with the bereaved families. I pray that the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Those…
— PMO India (@PMOIndia) October 1, 2023Pained by the loss of lives due to a bus accident near Coonoor in Nilgiris district, Tamil Nadu. My thoughts are with the bereaved families. I pray that the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Those…
— PMO India (@PMOIndia) October 1, 2023
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా..
అంతకుముందు ఈ బస్సు ప్రమాదం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు పర్యటక శాఖ మంత్రి కే రామచంద్రన్‌ను నియమించినట్లు తెలిపారు. మరోవైపు ప్రమాదం గురించి సమచాచారం తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం హైల్ప్ లైన్-1077 ను ఏర్పాటు చేసింది.
లోయలో పడి 8 మంది మృతి
ఈ ఏడాది ఆగస్టులో ఉత్తరాఖండ్ గంగోత్రిలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గంగోత్రి రహదారిపై గన్గ్నానీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 35 మంది భక్తులు ఉన్నారు. వీరంతా గుజరాత్‌కు చెందిన వారిగా తెలిసింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
లోయలో పడ్డ బస్సు.. స్కూల్ పిల్లలు సహా 12 మంది మృతి.. ప్రధాని విచారం