సరదాగా ఈత కొట్టడం వేరు.. ఈత కొట్టి రికార్డు కొట్టడం వేరు. ఇలా రికార్డును సృష్టించేవారు కొందరే ఉంటారు. రెండో కోవకు చెందుతాడు ఈ బాలుడు. 14 ఏళ్ల వయసులోనే పొడవైన కాలువను ఈది సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తమిళనాడు థేనీ జిల్లాకు చెందిన బాలుడు 14 ఏళ్ల స్నేహన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. అతి పొడవైన నార్త్ ఛానల్ కెనాల్‌ను అతి తక్కువ సమయంలోనే దాటి సరికొత్త రికార్డును సృష్టించాడు.
ఐర్లాండ్, స్కాట్లాండ్ దేశాల మధ్య ఉన్న నార్త్ ఛానల్ కెనాల్‌ను అతి తక్కువ సమయంలో ఈదాడు స్నేహన్. 35 కిలోమీటర్ల పొడవైన ఈ దూరాన్ని 14 గంటల 39 నిమిషాల్లోనే చేరుకున్నాడు. అండర్-14 కేటగిరీలో ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించిన నాలుగో వ్యక్తిగా స్నేహన్ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను సాధించడానికి చాలా కష్టపడ్డాడు స్నేహన్. అనేక వారాల పాటు ఇంగ్లాండ్‌లోని డొనఘడీ హర్బర్‌లో కోచ్ విజయ్ కుమార్ సారథ్యంలో శిక్షణ పొందాడు. అంతకుముందు బాఘ్ స్ట్రెయిట్‌ను దాటి రికార్డు సృష్టించాడు స్నేహన్.
ఇవీ చదవండి: షహీద్ భగత్ సింగ్ విమానాశ్రయంగా చండీగఢ్ ఎయిర్పోర్ట్: మోదీ
భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం