ETV Bharat / bharat

తమిళ పోరు: పోలింగ్​కు సర్వం సిద్ధం - తమిళనాడు ఓటర్ల సంఖ్య

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. మొత్తం 234 నియోజకవర్గాల్లో 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

tamilanadu polls
సీఎం పీఠం కోసం ద్రవిడ పార్టీల హోరాహోరీ పోరు
author img

By

Published : Apr 5, 2021, 5:51 PM IST

తమిళనాట ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. 234 శాసనసభ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

మొత్తం 3,998 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. విజయంపై అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే విశ్వాసంగా ఉన్నాయి.

తమిళనాడు ఎన్నికలు- ​ 2021

  • శాసనసభ స్థానాలు: 234
  • మొత్తం అభ్యర్థులు: 3,998
  • ఓటర్లు: 6,26,74,446
  • పురుషులు: 3,08,38,47
  • మహిళలు: 3,18,28,727
  • ఇతరులు: 7,246
  • పోలింగ్​ కేంద్రాలు: 88,937

దిగ్గజ నేతలు లేకుండా తొలిసారి బరిలో..

తమిళ రాజకీయాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు కరుణానిధి, జయలలిత. రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రజల్లో వారిది చెరగని ముద్ర. అలాంటిది.. ఎన్నో దశాబ్దాల తర్వాత.. ఈ దిగ్గజ నేతలు లేకుండా తొలిసారి పూర్తిస్థాయి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఏఐడీఎంకే కూటమి

  • ఏఐఏడీఎంకే- 179
  • పీఎంకే(పట్టాయ్​ మక్కల్​ కచ్చి): 23 స్థానాలు
  • భాజపా(భారతీయ జనతా పార్టీ): 20 స్థానాలు

డీఎంకే కూటమి

  • డీఎంకే- 173
  • కాంగ్రెస్: 25 స్థానాలు
  • సీపీఐ: 6 స్థానాలు
  • సీపీఎం: 6 స్థానాలు

ఉత్కంఠ..

అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొడుతుందా? డీఎంకే అధికారాన్ని దక్కించుకుంటుందా? లేక కమల్​ హాసన్​, దినకరన్​ పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయి? వంటి అంశాలు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అభ్యర్థుల్లో ప్రముఖులు

అభ్యర్థిపార్టీనియోజకవర్గం
పళనిస్వామి అన్నాడీఎంకేఎడప్పాడి
ఎంకే స్టాలిన్డీఎంకేకొలతూర్

పన్నీర్​ సెల్వం

అన్నాడీఎంకేబోడినాయక్కనూర్​
ఉదయనిధి స్టాలిన్​డీఎంకేచెపాక్​-ట్రిప్లికేన్​
కమల్​ హాసన్​ఎంఎన్​ఎందక్షిణ కోయంబత్తూర్
ఖుష్బూ సుందర్​భాజపాథౌజండ్​ లైట్స్​
దినకరన్ఏఎంఎంకే

కోవిల్​ పట్టి

సీమన్​

ఎన్​టీకేతిరువొట్రియూర్​

పటిష్ఠ భద్రత..

పోలింగ్​ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకున్నామన్నాని చెప్పారు.

మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.