కొత్తగా ఏదైనా షాపు ప్రారంభించేటప్పుడు యజమానదారులు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. తద్వారా తమ దుకాణానికి కావాల్సినంత ప్రచారం పొందుతారు. ఇదే తరహాలో తమిళనాడు దిండిగల్ జిల్లాలో ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న ఆఫర్ ప్రకటించింది. దాంతో జనం అక్కడకు తరలివచ్చారు.
తొలి వందమందికి...
దిండిగల్ జిల్లా సిరుమలాయ్లో ఓ బిర్యానీ షాపును ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా.. రూ.1 నోటు తీసుకువస్తే బిర్యానీ పార్సిల్‌ను ఉచితంగా తీసుకువెళ్లొచ్చు అని సదరు షాపు యజమాని ప్రకటించాడు. ఈ ఆఫర్ మొదటి 100 మందికి మాత్రమే వర్తిస్తుందని నిబంధన విధించాడు. దాంతో ఆ హోటల్‌కు జనం భారీగా తరలివచ్చారు.
డబ్బులను దాచుకోవడం, పాత నోట్లను భద్రపరచడంపై అవగాహన కల్పించేందుకు తాము ఈ ఆఫర్‌ను ప్రకటించామని బిర్యానీ షాపు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: రూ.10తో లక్షలు సంపాదించడం ఎలా?
ఇదీ చూడండి: 25 పైసలుంటే మీరు లక్షాధికారి అయినట్లే..!